హీరోయిన్ల విషయంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాక్ వేరు. కానీ, ఒకప్పుడు వారిని అగ్రహీరోలు సైతం ఎంతో గౌరవించిన పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు మాదిరిగా క్యాస్టింగ్ కౌచ్ వంటివి అప్పట్లో పెద్దగా లేవనే టాక్ ఉండేది. అందుకే హీరోయిన్లకు అత్యథిక ప్రాధాన్యం దక్కేది. ఒకప్పటి సినీ ఇండస్ట్రీని కుది పేసిన.. షావుకారు జానకి.. కృష్ణకుమారి అక్కా చెల్లెలు. ఆదిలో షావుకారు జానకి.. ఇంటి నుంచి వచ్చేసి.. నాటకాలు ఆడేవారు.
ఆమెకు నాటకాలు అంటే ప్రాణం. అందుకే ఆమె ఇంట్లో చెప్పకుండా తన స్నేహితులతో కలిసి వచ్చేశారు. ఈ క్రమంలోనే షావుకారు.. సినిమాలో తొలి ప్రవేశం లభించింది. అనంతరం.. ఆమెకు పెద్దగా ఛాన్స్‌లు దక్కలేదు. అదే సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. జానకిని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకుని.. ఆమెకు ఛాన్స్ కోసం రెండు స్టూడియోల యజమానులతోనూ మాట్లాడినట్టు గుమ్మడి రాసుకున్న పుస్తకం ద్వారా తెలుస్తుంది.
అయితే, జానకికి మాత్రం ప్రాధాన్యం దక్కలేదు. ఈ నేపథ్యంలో అన్నగారు సీతాకళ్యాణం సినిమాను స్వయంగా తీసినప్పుడు.. తమ సొంత బ్యానర్ ఎన్ ఏటీ కంబైన్స్‌కు ఆమెను వినియోగించుకున్నారు. సినిమా తొలి షాట్‌లో జానకి పూర్ణకుంభంతో కూర్చుని కనిపిస్తారు. దీనికి కారణం.. తాను పరిచయం చేయడం ద్వారా మంచి అవకాశాలు వస్తాయని.. జానకి పుంజుకుంటారని అన్నగారు భావించడమే. తద్వారా తర్వాత కాలంలో జానకికి మంచి మంచి అవకాశాలు దక్కాయి.
ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా తెరవెనక ఉన్న వారిలో జానకి ఒకరు. ఎన్టీఆర్‌కు తెరవెనక సలహాలు ఇవ్వడం.. రాజకీయంగా ఆయన ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకుని.. ముఖ్యమంత్రి అవ్వాలని ఆమె ఎంతో బలంగా ఆకాంక్షించేవారట. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టే ముందు ఉన్న చాలా చర్చల్లో ఆమే స్వయంగా పాల్గొనేవారు. అప్పట్లో జానకి రికమెండ్ చేసిన ఒకరిద్దరు బీసీ నేతలకు కూడా ఎన్టీఆర్ టిక్కెట్లు ఇచ్చారు.