సూపర్‌స్టార్ కృష్ణ మరణం నుంచి ఇప్పటకీ తెలుగు సినీ ప్రేమికులు, ఆయన అభిమానులే కాదు.. తెలుగు జనాలు కూడా కోలుకోవడం లేదు. ఇక కృష్ణకు ఇందిరాదేవితో ఐదుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు కాగా.. కుమార్తెలలో గల్లా పద్మావతి – మంజుల – ఇందిరా ప్రియదర్శిని. వీరిలో రమేష్‌బాబు ఇప్పటికే అనారోగ్యంతో మృతి చెందగా.. మహేష్‌బాబు ఈ రోజు టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్‌స్టార్‌గా ఉన్నారు.
ఇక కుమార్తెల్లో పెద్ద కుమార్తె పద్మావతి చిత్తూరు జిల్లాలోని బలమైన పారిశ్రామిక, రాజకీయ కుటుంబానికి చెందిన గల్లా ఫ్యామిలీకి కోడలిగా వెళ్లారు. గల్లా రామచంద్రనాయుడు మనవడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు అయిన గల్లా జయదేవ్‌కు ఆమె భార్య. వాళ్లకు కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉంది. ఇక జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ తరపున రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
కృష్ణ ఇష్టంతో కుదుర్చుకున్న సంబంధం కావడంతో పద్మ పెళ్లికి వచ్చిన ఇబ్బంది లేదు. ఇక మంజుల విషయానికి వస్తే మంజుల – సంజయ్‌ది ప్రేమ వివాహం. ఈ ప్రేమ కృష్ణకు ముందుగా ఇష్టం లేదని చెపుతారు. అందుకే మంజులకు చాలా లేట్ ఏజ్‌లో పెళ్లైంది. కృష్ణ ఆలోచనల్లో మంజులను బాగా సంపన్నుల కుటుంబానికి ఇవ్వాలని.. పెద్ద కుమార్తె పద్మను ఎంత పెద్ద కుటుంబానికి కోడలిగా పంపానో మంజులను కూడా అంతే పెద్ద సంపన్న, పేరున్న కుటుంబానికి కోడలిగా పంపాలని అనుకున్నారు.
మంజుల – సంజయ్ ప్రేమను ఒప్పుకోకపోవడంతో మంజుల కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఏడెనిమిదేళ్ల పాటు ఉండిపోయింది. అయితే చివరకు ఇందిర కష్టమైనా, నష్టమైనా కుమార్తే కదా పడేది. ఆమె ప్రేమకు అడ్డు చెప్పవద్దని చెప్పడంతో చివరకు కృష్ణ దిగివచ్చి మంజుల ప్రేమపెళ్లికి ఒప్పుకున్నారు.
ఇక చిన్నకుమార్తె ఇందిరా ప్రియదర్శిని ప్రేమ పెళ్లి విషయంలో కూడా కృష్ణ ముందు కాస్త తటపటాయించిన మాట వాస్తవం. సుధీర్‌బాబు – ఇందిర మధ్య జిమ్ వర్కవుట్లు చేసేటప్పుడు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారిందంటారు. సుధీర్‌బాబు కుటుంబానికి కూడా చెప్పుకోదగ్గ ఆస్తులే ఉన్నాయి. అయితే కృష్ణ ముగ్గురు కుమార్తెల్లో టాప్ ఫ్యామిలీ ఏది అంటే ఖచ్చితంగా పెద్ద కుమార్తెదే అని చెప్పాలి.
ఇక సుధీర్‌బాబుకు చిన్న కుమార్తె ప్రియదర్శినిని ఇచ్చి చేసే విషయంలో కృష్ణ ఆలోచనకు కారణం కూడా ఉంది. పెద్ద కుమార్తెది తాను స్వయంగా కుదిర్చిన వివాహం. మంజుల విషయంలో తన మాట నెగ్గలేదు. చివరకు చిన్న కుమార్తెను కూడా పద్మ రేంజ్‌కు తగిన సంబంధం చూసి.. బాగా గొప్పింటి అల్లుడినే చేసుకోవాలని అనుకున్నారు. అయితే చివరకు ఎన్ని ఆలోచనలు చేసినా వీరి ప్రేమకు కూడా ఒప్పుకోక తప్పలేదు.
అయితే చివరకు సుధీర్‌బాబును కృష్ణ ఇల్లరికం అల్లుడిని చేసుకున్నారు. వృద్ధాప్యంలో తనకు అన్ని విధాలా ఆసరగా ఉంటాడనే ఆయన అనుకుని సుధీర్‌ను ఇల్లరికం అల్లుడిని చేసుకుని తన ఇంట్లో ఉంచుకున్నారు. అందుకే చివరి వరకు కూడా చిన్న కుమార్తె, సుధీర్‌బాబు కృష్ణ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఇంట్లోనే విజయనిర్మల కూడా ఉండేవారు.