Moviesఏజ్ అయిపోయాక ఛాన్సుల కోసం స్టార్ హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే...!

ఏజ్ అయిపోయాక ఛాన్సుల కోసం స్టార్ హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే…!

సినిమా ఇండస్ట్రీలో అన్నిటికీ మూలం సక్సెస్. ఒక్కసారి సక్సెస్ వచ్చాక దాన్ని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ పాకులాడుతుంటారు. కొందరికి మాత్రం ఆ అవసరం లేకుండా ఆ సక్సెస్ వారితోనే కొనసాగుతుంటుంది. ఇక్కడ నిలబడాలంటే టాలెంట్..అందం..మాత్రమే కాకుండా ప్రత్యేకించి హీరోయిన్స్‌కి లక్ చాలా ముఖ్యం. లక్ ఫేవర్ చేస్తే ఏ ఒక్కరూ వారిని ఆపలేరు.

మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా అవన్నీ ఊడిపోయే వెంట్రుకలాంటివి. అలా అప్పటి తారామణులు ఎందరో ఇరవై నుంచి నలభై ..యాభై ఏళ్ళ వరకూ నటిస్తూనే ఉన్నారు. ఈ తరం కథా నాయికలలో నయనతార..శ్రీయ శరణ్..కాజల్ అగర్వాల్ లాంటి వారు పదిహేనేళ్ళ నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు. అనుష్క శెట్టి, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్స్‌కి ఇంకా క్రేజ్ తగ్గలేదు.

అయితే, వీరందరూ ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కంటిన్యూ అయ్యేందుకే అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎద అందాలతో పాటు నాభి సోయగాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఫిజిక్ బావుంటే సీనియర్ హీరోల సరసన ఛాన్స్ గ్యారెంటీ అనే విషయం తెలిసిందే.

అందుకే, ఆ ఫిజిక్ విషయంలో ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు. సీనియర్ హీరోల సరసన అవకాశాలు రాకపోయినా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నారు. ఈ సీనియర్ కథానాయికల కోసం మేకర్స్ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌ను తీసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, ఏజ్ అయిపోతుందనే బెంగ ఈ తరం హీరోయిన్స్‌కి ఉండటం లేదు.

ఓటీటీలలో అయితే ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత గొప్ప అవకాశాలు అనేట్టుగా ఉంది. ఇక్కడ ప్రియమణి లాంటి కాస్త ముదురు భామలు బాగా అవకాశాలు పొందుతున్నారు. అందుకే, వీరు హీరోల సరసన నటించే అవకాశాల కోసమే ఎదురుచూడటం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news