టాలీవుడ్‌లో ఆయన సినిమా తీసే విధానానికి మూవీ క్రిటిక్స్ క్రియేటివ్ డైరెక్టర్స్ అని పేరు పెట్టారు. ఆ దర్శకుడే కృష్ణవంశీ. వివాదాల దర్శకుడు రాం గోపాల్‌వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కృష్ణవంశీ గులాబి సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలోని మేకింగ్..క్రియేటివ్ నెస్ చూసిన కింగ్ నాగార్జున కృష్ణవంశీకి తన సొంత నిర్మాణ సంస్థలో నిన్నే పెళ్లాడతా సినిమా ఛాన్స్ ఇచ్చారు.
ఈ సినిమాతో కృష్ణవంశీ స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయారు. కృష్ణవంశీ తన సినిమా కథను ఎంత క్రియేటివ్‌గా రాసుకుంటారో దాన్ని తెరమీదకి తీసుకువచ్చేందుకు అంతే క్రియేటివ్‌గా ఆలోచించి మేకింగ్ పరంగా కొత్త కొత్త ఐడియాను అప్లై చేస్తారు. అందుకే, ఆయన సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకుల్లో నిలిచిపోతుంది. సినిమా ఫ్లాపైనా ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇండస్ట్రీలో కృష్ణవంశీ సినిమాలకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
అయితే, ఇప్పటి వరకూ కృష్ణవంశీ నాగార్జున, మహేష్ బాబులతో తప్ప మిగతా పెద్ద హీరోలతో సినిమా చేసింది లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా అనుకున్నారు..అలాగే బాలకృష్ణతో, వెంకటేష్‌తో సినిమాలు చేయలేదు. వీరే కాదు, ఆయన సతీమణి సీనియర్ నటి రమ్యకృష్ణతోనూ సినిమా చేయలేదు. కాన్ని, ఇన్నేళ్ళకి ఆ అవకాశం దక్కింది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత తన భార్య రమ్యకృష్ణను ఆయన డైరెక్ట్ చేశారు. దీనికి కారణం బాహుబలి సిరీస్ అని చెప్పాలి.
అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన నరసింహ మూవీతో ఎంతటి గొప్ప పేరొచ్చిందో..ఇటీవల బాహుబలి సిరీస్‌తో అంతకి నాలుగు రెట్ల పేరొచ్చింది. అదే క్రేజ్‌ను వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ ఉపయోగించుకోవాలనుకున్నారు. అందుకే, ఆయన తీస్తున్న రంగ మార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలను ముఖ్య పాత్రలకి తీసుకున్నారు.
అలాగే గత కొద్ది రోజులుగా రమ్య, కృష్ణవంశీ మధ్య విబేధాలు రావడంతో వీరు వేర్వేరుగా ఉంటున్నారన్న పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కృష్ణవంశీ హైదరాబాద్‌లో ఉంటే, రమ్య చెన్నైలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వీటికి క్లారిటీ కూడా కృష్ణవంశీ ఈ సినిమాతో ఇచ్చేశాడు. రమ్య ఈ సినిమాకి ప్రధాన బలం అని కృష్ణవంశీ చాలా ధీమాగా చెబుతున్నారు. చూడాలి మరి ఆయన ఆశించిన సక్సెస్ రంగ మార్తాండ – రమ్యకృష్ణ రూపంలో వస్తుందా..