మెగాస్టార్ చిరంజీవి తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. బాబి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ముందు నుంచి టాలీవుడ్ సినీ జనాలతో పాటు మెగాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గాడ్ ఫాదర్ రెండూ డిజప్పాయింట్ చేయడంతో వాల్తేరు వీరయ్యతో చిరు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడతారనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది.
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి ఈ రోజు బాస్ పార్టీ అన్న పల్లవితో సాగిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. నాకాష్ అజిజ్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, హరి ప్రియా ఈ సాంగ్‌కు లిరిక్స్ కూడా దేవిశ్రీయే ఇవ్వడం మరో విశేషం. 3.19 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్‌ను విశ్లేషించుకుంటే ఏ కోశానా దేవిశ్రీ మనసు పెట్టి చేసినట్టుగా లేదు. ఎవరెన్ని అనుకున్నా చిరంజీవి వీరాభిమానుల అంచనాలకు కూడా ఐదారు కిలోమీటర్ల అవతలే ఈ సాంగ్ ఆగిపోయింది.
కుండ వాయిస్తోన్న సౌండ్, పక్కన చిన్నప్పుడు తిరునాళ్లలో పిల్లనగ్రోవి మ్యూజిక్‌తో ట్యూన్ కట్టేశాడు. ఈ ట్యూన్ పరమరాడ్, వరస్ట్‌గా ఉంది. అసలు కనీసం డ్యాన్స్ మాస్టర్‌కు అయినా కొత్తగా స్టెప్పులు ఇవ్వాలన్న ఆలోచన రానంత దరిద్రంగా ట్యూన్ ఉంది. దీనికి తోడు మధ్యలో దేవి ఇచ్చిన పల్లవి అయితే కంపు కషాయంగా ఉందనిపిస్తోంది. చిరు కూడా ఈ లుంగీ వేసుకున్న మాస్ స్టెప్పులు ఎప్పుడో ముఠామేస్త్రి సినిమాలో.. అంతకు ముందు ఎన్నోసార్లు వేసేసినవే..!
ఇక సాంగ్ కూడా మన కర్మకు దేవిశ్రీ రాసిందే.. అందులో పదాలు కాని.. పదాల కూర్పు కాని ఎన్నిసార్లు విన్నా ఏమాత్రం ఆసక్తిగా లేవు. అసలే 3 నిమిషాలు ఉన్న సాంగ్‌లో ప్రతి పదానికి చివర కోరస్‌ను పాడించడంతో దేవి కూడా పెద్దగా కష్టపడకుండా పనైపోయింది. వెరీ ఈజ్ ద పార్టీ ఏమో గాని వాట్ ఈజ్ దిస్ బాసూ అని ఫ్యాన్సే తలలు పట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ ఫెయిల్ అవ్వడానికి ముమ్మాటికి దేవిశ్రీదే బాధ్యత అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఏదేమైనా అల వైకుంఠపురంలో, సర్కారు వారి పాట సినిమాలు పోటాపోటీగా వచ్చినప్పుడు మహేష్ సినిమాను నిండా ముంచేసిన దేవిశ్రీ ఇప్పుడు సంక్రాంతి బరిలో ప్రెస్టేజ్‌గా వస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాకు ఇంత నీరసమైన మ్యూజిక్‌తో రాడ్ దింపేస్తాడనుకోలేదని ఫ్యాన్స్ గగ్గోలు మొదలైపోయింది.