సురేష్‌బాబు అంటేనే ఏ విషయంలో అయినా లెక్కలు పక్కగా ఉంటాయి. ఆయన రెండో తనయుడు దగ్గుబాటి అభిరాంను వెండితెరకు పరిచయం చేసే విషయంలోనూ ఆయన చాలా లెక్కలతోనే బరిలోకి దిగాడు. బడ్జెట్ పెట్టే విషయంలో ఆయన ఎంత పిసినారిగా ఉంటాడో చెప్పక్కర్లేదు. లో బడ్జెట్ సినిమాల దర్శకుడు తేజ చేతుల్లో అభిరాంను పెట్టాడు. తేజ సినిమా అంటేనే కథలో హీరో ఓ పిరికోడు.. హీరోయిన్ మనోడిని రెచ్చగొట్టి విలన్‌ను కొట్టించే లానే ఉంటాయ్.
ఇక కొద్ది రోజుల క్రితమే అభిరాం ఫేస్ కనపడకుండా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్సాన్సే వచ్చింది. ఈ లుక్ అలా రిలీజ్ అయ్యిందో లేదో హాట్ దేవత శ్రీరెడ్డి టార్గెట్ చేయడం మొదలు పెట్టేసింది. శ్రీరెడ్డికి, అభిరాంకు పాత గొడవలు ఏవేవో ఉన్న సంగతి తెలిసిందే. అభిరాం తనను లైంగీకంగా, శారీరకంగా వాడుకుని వదిలేశాడని చెప్పడంతో పాటు ఫొటోలు కూడా రిలీజ్ చేసి నానా హడావిడి చేసింది.
అప్పటి నుంచి ఆమె దగ్గుబాటి ఫ్యామిలీకి శాపాలు పెడుతూనే వస్తోంది. సురేష్‌బాబును మామ, వెంకీని చినమామ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది. నా ఉసురు తగిలి అహంస ప్లాప్ అవుతుందని శాప కీర్తనలు వల్లిస్తూ ఉంటుంది. అసలే ఈ నెగటివ్ ప్రచారం ఉందిరా బాబు అంటే.. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సురేష్‌బాబుకే సరైన డేట్ దొరకడం లేదట.
సురేష్‌బాబు బిజినెస్‌మేన్. తన సినిమా సోలోగా రావాలి.. అందుకు తగిన డేట్ కుదరాలి. పైగా అభిరాంకు తొలి సినిమా. అందుకే అన్నీ లెక్కలు వేసుకుని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అహింసను అక్టోబర్, నవంబర్ రిలీజ్ అన్నా కుదర్లేదు. డిసెంబర్ 23న అనుకున్నారు. అయితే అదే రోజు రవితేజ ధమకా, నిఖిల్ 18 పేజెస్ వస్తున్నాయి. ఈ రెండు సినిమాల మధ్యలో అహింస నలగడం ఖాయం. సురేష్‌బాబు ఎన్ని థియేటర్లు ఇచ్చినా హిట్ టాక్ వస్తే తప్ప సినిమా నిలబడదు.
ఒకవారం ముందుకు వద్దామంటే అవతార్ 2 లైన్లో ఉంది. డిసెంబర్ 9న చాలా సినిమాలు ఉన్నాయి. ఇక జనవరికి వెళదామనుకుంటే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలోనే రావాలి. దీంతో ఇప్పుడు సురేష్‌బాబుకు సైతం ఇంత పెద్ద నెట్వర్క్ ఉండి కూడా తన కొడుకు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి.