మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఆల్ రౌండర్ అయిపోయారు. ఆయన కేవలం తన సినిమాలకు దర్శకుడు మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ సినిమాలకు వరుస పెట్టి స్క్రీన్ ప్లేతో పాటు కథ అందిస్తూ మాటలు రాసే కొత్త డ్యూటీలో కూడా ఉన్నాడు. త్రివిక్రమ్ కేవలం స్క్రీన్‌ప్లే, మాటలు ఇచ్చినందుకే ఒక్కో సినిమాకు రు. 10 కోట్లు ముడుతున్నాయి.
ఇక హారిక బ్యానర్ పైకి నడిపించేది చినబాబే అయినా తెరవెనక దాని వెన్నుముక త్రివిక్రమే అంటారు. ఇక సితార బ్యానర్ కూడా త్రివిక్రమ్ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. ఇలా త్రివిక్రమ్ పైకి డైరెక్టర్‌గా మాత్రమే సంపాదిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రెండు బ్యానర్లలో పెట్టుబడులతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ, పవన్ సినిమాలు సెట్ చేస్తూ రకరకాలుగా సంపదిస్తున్నాడు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ భార్య కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే అది తెరమీద కాదు.. తెరవెనక. కరోనా టైంలో మల్లూవుడ్‌లో హిట్ అయిన కప్పెల సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సితార నాగవంశీ నిర్మించే ఈ సినిమాకు బుట్టబొమ్మ అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ కూడా వదిలారు. ఓ అమాయక పల్లెటూరు అమ్మాయి, పట్నం పిల్లాడి లవ్‌లో పడితే ఎలా ? ఉంటుందన్న కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాలో సితార నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటారు. ఇలా ఇప్పటి వరకు త్రివిక్రమ్ దర్శకుడిగాను, నిర్మాణ భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు తన భార్యను కూడా నిర్మాతగా రంగంలోకి దింపుతున్నారు. మరి సాయి సౌజన్య ఈ ఫీల్డ్‌లో ఎలా సక్సెస్ అవుతుందో ? చూడాలి.