ప్రేమ అనేది ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. అయితే మొదటిసారి ప్రేమలో పడటం అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదే… వారిని జీవితాంతం మర్చిపోలేరు. మన టాలీవుడ్ హీరోయిన్లకు సైతం ఒకప్పుడు మొదటి ప్రేమ అనుభవాలు ఉన్నాయి. వాటిని పలు సందర్భాలలో ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
శృతీహాసన్ :
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తాను కచ్చితంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇక తాను కిండర్ గార్డెన్ స్కూల్ లో ఉన్న చదువుతున్న సమయంలో ఆదామ్ అనే అబ్బాయితో మొదటి సారి ప్రేమలో పడినట్టు వెల్లడించింది. అతడు అమెరికాకు చెందిన వాడని తెలిపింది.
పాయల్ రాజ్పుత్ :
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్గా సక్సెస్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బోల్డ్ నటిగా పాయల్ రాజ్పుత్ కు టాలీవుడ్లో ఎంతో గుర్తింపు ఉంది. ఇక పాయల్ కూడా ఒకప్పుడు ప్రేమలో మునిగి తేలింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ప్రేమ అనేది అద్భుతమైన అనుభవం. ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రేమలో పడతారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాను. అతనితోనే ఇంటర్ వరకు ప్రేమలో ఉన్నాను. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది అంటూ తెలిపింది.
కియారా అద్వానీ :
కీయారా అద్వానీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. తన మొదటి ప్రేమ గురించి ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను పదో తరగతిలో ఓ అబ్బాయిపై మనసు పారేసుకున్నట్టు తెలిపింది. అతను కూడా తనను ప్రేమించాడని చెప్పింది. అయితే అది కేవలం అట్రాక్షన్ మాత్రమే అని చెప్పింది. తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్పినట్టు వెల్లడించింది. కానీ తన తల్లి ముందు చదువుకో అని వార్నింగ్ ఇచ్చిందని ఆ తర్వాత అతడిని మర్చిపోయానని చెప్పింది.
నిధి అగర్వాల్ :
హాట్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంతో పేరు సంపాదించుకుంది. ఇక అందాల నిధి సైతం ఒకప్పుడు ప్రేమలో పడింది. తాను 4వ తరగతిలో ప్రేమలో పడినట్టు నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొన్నేళ్ల తర్వాత అతడితో డేట్ కి వెళ్లానని చెప్పింది. కానీ ఆ తర్వాత తన హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పింది. ఆ తర్వాత ఎవరినీ ప్రేమించలేదని వెల్లడించింది.
తాప్సీ :
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక తాప్సీ సైతం తన మొదటి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. తన స్నేహితుల కంటే తాను చాలా ఆలస్యంగా ప్రేమలో పడ్డాను అని చెప్పింది. తాను 9వ తరగతిలో మొదటిసారి ప్రేమలో పడినట్టు వెల్లడించింది. కానీ ఏడాదిలోనే బ్రేకప్ అయ్యిందని చెప్పింది. అతడి పేరును బయటకు చెప్పలేనని వెల్లడించింది.