టాలీవుడ్‌లో గత కొద్ది రోజులుగా వరుసగా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. గత యేడాది కాలంలో ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులను సీనియర్లను కోల్పోతున్నాం. రెబల్‌స్టార్ కృష్ణంరాజు మృతి నుంచి కోలుకోకముందే.. మరో సీనియర్ హీరో, సూపర్‌స్టార్ కృష్ణ కూడా మృతిచెందారు. మరో బాధాకర విషయం ఏంటంటే కృష్ణ భార్య ఇందిరాదేవి మృతిచెంది రెండు నెలలు కూడా కాకుండానే కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
కృష్ణ విషాదం నుంచి కోలుకోక ముందే టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. యంగ్ డైరెక్టర్ మృతిచెందారు. రచయిత, డైరెక్టర్ మదన్ గత అర్ధరాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి దాటక ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. మదన్ ఇండస్ట్రీలో రచయితగానే కాకుండా… డైరెక్టర్‌గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు.
ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి కెమేరామెన్ ఎస్. గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. అసిస్టెంట్ కెమేరామెన్‌గా కెరీర్ ప్రారంభించిన మదన్.. అంతకుముందు మనసంతా నువ్వే సినిమాకు కూడా పనిచేశారు. రాజేంద్రప్రసాద్ ఆ నలుగురు సినిమాతో రచయితగా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నారు.
జగపతిబాబు, ప్రియమణి జంటగా వచ్చిన పెళ్లైనకొత్తలో సినిమాతో మెగాఫోన్ పట్టిన మదన్ ఆ తర్వాత ప్రవరాఖ్యుడు – గాయత్రి – గరం – గుండె ఝల్లుమంది – కాపీ విత్ మై వైఫ్ – సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఏదేమైనా వైవిధ్యమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తారన్న పేరు మదన్‌కు ఉంది. మదన్ మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.