సమంత ప్రధాన పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా యశోద. మణిశర్మ సంగీతం అందించారు. కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కించిన ఈ సినిమా టీజర్లతో ఆకట్టుకుంది. దీనికి తోడు సమంత కూడా ప్రమోషన్లలో ఎమోషనల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
సమంత (యశోద) తన చెల్లికి ఆపరేషన్ కోసం సరోగసీకి ఒప్పుకుంటుంది. అయితే డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్న పేద అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపించి సరోగసీ తల్లిగా మారే మాఫియాలో మధు మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) అండ్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) కీలకంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే యశోద కూడా సరోగసీతో బిడ్డను కని ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది. అయితే దీని వెనక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు ఆమెలో కలుగుతాయి. అసలు ఈ కుట్రను ఆమె ఎలా చేధించింది ? సరోగసీ పేరుతో జరుగుతున్న అకృత్యాలు ఏంటి ? వీటిని తెలుసుకునేందుకు యశోద ఏం చేసింది ? సరోగసీ పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆమె ఎలా బయట పెట్టిందన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
ఈ సినిమాలో యశోద పాత్రలో నటించిన సమంత అదిరిపోయే పెర్సామెన్స్తో ఆకట్టుకుంది. పాత్రలో ఉన్న వేరియేషన్లకు తగినట్టుగా ఆమె నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. ఫస్టాఫ్‌లో అమాయక యువతిగా కనిపిస్తే.. సెకండాఫ్‌లో అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్‌తో ఆమె చేసిన యాక్షన్ ఆమె పాత్రకు బాగా సెట్ అయ్యాయి. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లతో ఆమె భావోద్వేగ సన్నివేశాలను చక్కగా పండించింది. ఇక విలన్‌గా కనిపించిన ఉన్ని ముకుందన్ కూడా తన పాత్రకు తగ్గట్టే లుక్స్, పిజిక్ బాగా మార్చుకున్నాడు. మరో కీలక పాత్రలో కనిపించిన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా తన పాత్రతో సినిమాకు మెయిన్ పిల్లర్లలో ఒకటిగా నిలిచింది.
ఇక రావు రమేష్, మురళీ శర్మ, సంపత్‌రాజ్, శత్రు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకులు హరి, హరీష్ కొత్త కథను రాసుకున్నా ఆసక్తికరమైన కథనంతో సినిమాను ట్రావెల్ చేయించలేదు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమాలు చూపించిన విధానం బాగున్నా కొన్ని లోపాలు సినిమా లెవల్ తగ్గించేశాయి. ఫస్టాఫ్‌లో స్లోగా నడిచే సీన్లుతో సినిమా కాస్త స్లో అయినట్టుగా కనిపిస్తుంది.
ఫస్టాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్లు పడతాయి. పోలీసులు ఇన్వెస్ట్ గేషన్ చేసేటప్పుడు కథ ఆసక్తిగా ఉండాలి.. అయితే సినిమాలో సింపుల్‌గా ఇన్వెస్ట్‌గేషన్ తేల్చేశారు. థ్రిల్లర్ సినిమాల్లో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఉండాలి. యశోద ఆ విషయంలో కొంత వరకు సక్సెస్ అయ్యింది. అద్దె గర్భంతో పిల్లలను కనేందుకు వచ్చిన మహిళలు ఒకే చోటకు రావడం.. తర్వాత ఒక్కొక్కరు మాయం కావడంతో ఈ మిస్టరీ చేధించేందుకు హీరోయిన్ చేసిన ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి.
అయితే సెకండాఫ్ స్టార్ట్ అయిన కొద్ది సేపటికే కథ గుట్టు తెలిసిపోతుంది. ప్రి క్లైమాక్స్ ముందు ట్విస్ట్ రివీల్ చేయడం మైనస్. అయితే సినిమా ఎక్కడా బోర్‌గా ఉన్నట్టు అనిపించదు. ఓవరాల్‌గా డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వాళ్లకు యశోద బెస్ట్ ఆప్షన్.
యశోద రేటింగ్: 2.75 / 5