ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు బిగ్ బాస్ లో హంగామా చేస్తూ ఉన్నవి లేనిపోనివి క్రియేట్ చేసిన టాప్ కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుందా అంటే అవునని అంటున్నారు జనాలు. గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ లెక్కలు మొత్తం పూర్తిగా తారుమారు అవుతున్నాయి . హౌస్ లో ఉండాలి అనుకుంటున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు . వీక్ కంటెస్టెంట్ లు స్ట్రాంగ్ గా మారుతున్నారు.
ఈ క్రమంలోనే లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన మెరీనా.. బిగ్ బాస్ పూర్తి లెక్కలను తారుమారు చేసేసింది. మరీ ముఖ్యంగా రోహిత్ ను టాప్ పొజిషన్ లోకి వచ్చేలా మెరీనా ఎలిమినేషన్ జరిగింది. కాగా ఈ వారం నామినేషన్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు . ఆదిరెడ్డి ,రోహిత్, శ్రీహాన్, శ్రీ సత్య, రాజ్ , ఇనయా, ఫైమా. కెప్టెన్ కారణంగా రేవంత్ నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ప్రతి వారం నామినేషన్ లో ఉండే కీర్తి కూడా ఈసారి అనూహ్యంగా నామినేషన్ నుంచి తప్పించుకుంది . దీంతో ఈ ఏడుగురులు ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ ఇంట్రెస్టింగ్ పోల్ సోషల్ మీడియాలో మొదలైంది.
కాగా పలు వెబ్ పోల్స్ ఆధారంగా డేంజర్ జోన్ లో ఉన్నది శ్రీసత్య అనిపిస్తుంది. అందరికన్నా టాప్ పొజిషన్లో ఇనయా..ఆ తర్వాత రోహిత్ ..ఆ తర్వాత శ్రీహన్.. ఆ తర్వాత ఆదిరెడ్డి, రాజ్ ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇలా వెబ్ పోల్స్ ఆధారంగా డేంజర్ జోన్ లో ఉండే శ్రీ సత్య, ఫైమా లల్లో కచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె తన ఎవిక్షన్ ఫీర్ పాస్ ద్వార ఎలిమినేషన్ తప్పించుకునే పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి.
ఒకవేళ అదే జరిగితే శ్రీ సత్య హౌస్ నుంచి బయటికి రాక తప్పదు . ఈ క్రమంలో శ్రీ సత్య కారణంగా ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుండి వెళ్లిపోయిన్ కంటెస్టెంట్స్ అందరూ అ బిగ్ బాస్ లో ఉన్న శని బయటికి వచ్చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రీ సత్య డబల్ గేమ్ ఆడుతుంది అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది . తన అందాలతో ఎర గా ఇన్ని రోజులు నెట్టుకొచ్చిన శ్రీ సత్య ..డమ్మీ అంటూ జనాలు కూడా చెప్పుకొస్తున్నారు . శ్రీ సత్య ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ గేమ్ మొత్తం టర్న్ అవుతుంది అన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పటివరకు టాప్ ఫైవ్ లో ఎవరుంటారు అన్న అంచనా ప్రకారం రేవంత్, శ్రీహాన్, ఫైమ, రోహిత్, ఆదిరెడ్డి అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.