Moviesఎంత‌మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా ఆ విష‌యంలో దిశాప‌టానీని కొట్టేవాడే లేడా...!

ఎంత‌మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా ఆ విష‌యంలో దిశాప‌టానీని కొట్టేవాడే లేడా…!

సినిమాల్లో న‌టించేస్తాం… హీరోయిన్లుగా టాప్ ప్లేసుకు వెళ్లిపోతాం అనుకుంటే కుద‌ర‌దు.. అందుకు త‌గిన క‌స‌ర‌త్తులు చేయాల్సి ఉంటుంది. ప‌ర్‌ఫెక్ట్‌గా ఫిజిక్ మెయింటైన్ చేసుకోవాలి. హీరోల‌కు యాక్ష‌న్ సీన్లు ఉంటాయి.. వాళ్లు నిరంత‌రం జిమ్‌ల్లో క‌స‌ర‌త్తులు చేయాలి.. బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉండేలా చూసుకోవాలి. హీరోయిన్ల‌కు యాక్ష‌న్ సీన్లు చేసేంత సీన్ ఉండ‌దు.. వీళ్లేదో యాక్ష‌న్ సీన్ల‌లో ఇర‌గ‌దీసేస్తారు అనోకాదు… అయితే హీరోయిన్లు కూడా కొంతైనా వ‌ర్క‌వుట్లు చేసుకోవాల్సిందే..!

బాలీవుడ్‌, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని చోట్లా హీరోయిన్లు జిమ్‌ల్లో తెగ వ‌ర్క‌వుట్లు చేస్తూ, క‌ష్ట‌ప‌డుతోన్న ఫొటోలు ఎలా వైర‌ల్ అవుతుంటాయో మ‌నం సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కొంద‌రు హీరోయిన్లు మ‌రీ రెచ్చిపోయి వ‌ర్క‌వుట్లు చేస్తూ తొడ‌ల పైకి క‌న‌ప‌డేలా ఎక్స్ పోజింగ్‌కూడా చేస్తూ ఉంటారు. ఇక ఎంత‌మంది హీరోయిన్లు ఎంత ఫిట్‌నెస్ వ‌ర్క‌వుట్లు చేసినా అత్యంత ఫిట్‌నెస్‌గా క‌నిపించే హీరోయిన్ ఎవ‌రు ? అన్న పోటీ పెడితే ఫ‌స్ట్ ప్లేసులో ఉంటుంది బాలీవుడ్ భామ దిశాప‌టానీ.

ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెడుతూ త‌న ఫాలోవ‌ర్ల‌ను అల‌రించే దిశ గ్లామ‌ర్తో పాటు ఫిట్‌నెస్‌ను కూడా బాగా కాపాడుకుంటూ వ‌స్తుంది. కేవ‌లం జిమ్‌లో బ‌రువులు ఎత్త‌డం మాత్ర‌మే కాదు… కిక్ బాక్స‌ర్ లెవ‌ల్లో ఆమె త‌న ఫిట్‌నెస్ కాపాడుకుంటూ వ‌స్తోంది. దిశ హై లెగ్ కిక్స్ చూసి వావ్ అని అనాల్సిందే. ఆ రేంజ్లో ఆమె ఫిట్‌నెస్ క‌నిపిస్తుంది.

దిశ ఎగిరి మ‌రీ త‌న లెగ్స్‌తో బ్యాగ్‌ను త‌న్నుతోన్న సీన్ అయితే ఫ్యీజులు ఎగిరేలా ఉంటుంది. అస‌లు సినిమాల్లోనే ఈ స్టైల్ ఫీట్లు ఎవ్వ‌రూ చేయ‌లేరు. అయితే దిశ‌మాత్రం అద్భుత‌మైన ఫిట్‌నెస్‌తో చేస్తోన్న రచ్చ అయితే మామూలుగా ఉండ‌దు. అస‌లు ఈ ఫిట్‌నెస్‌, ఈ వ‌ర్క‌వుట్లు చూస్తుంటే కిల్ బిల్ రేంజ్ స్టైల్ సినిమా చేయ‌డానికి కావాల్సినంత స‌త్తా ఉన్న‌ట్టుగా అనిపిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news