గత యేడాది కాలంలో ఎక్కడ చూసినా తెలుగు జనాలు, తెలుగు సినీ ప్రేమికుల నోట జై బాలయ్యా స్లోగన్ మార్మోగుతోంది. అసలు అఖండ సినిమాకు ముందు నుంచే.. ఇంకా చెప్పాలంటే అన్‌స్టాపబుల్ సీజన్ 1 ఎనౌన్స్ అయినప్పటి నుంచి ఊపందుకున్న ఈ స్లోగన్ ఇప్పుడు పీక్స్ స్టేజ్‌కు చేరిపోయింది. అసలు బాలయ్య ప్రోగ్రామ్స్, బాలయ్య సినిమాలు ఆడుతోన్న థియేటర్లలోనే కాదు.. ఏ థియేటర్లో అయినా.. అది సింగిల్ స్క్రీనా, మల్టీఫ్లెక్సా అవసరం లేదు.. క్లాస్, మాస్ తేడా లేకుండా చివరకు ఏ హీరో సినిమా చూస్తున్నా కూడా ఆ ప్రేక్షకులు ఒక్కసారిగా జై బాలయ్య నినాదాలతో మార్మోగిపోయేలా చేస్తున్నారు.
ఏదేమైనా బాలయ్య ఇటీవల తనను తాను చాలా మార్చుకున్నాడు. 60 ఏళ్లు దాటాక చిరంజీవి, రజనీకాంత్ లాంటి వాళ్ల సినిమాలకు క్రేజ్ తగ్గుతోందన్నది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఉదాహరణకు చిరునే తీసుకుంటే ప్లాప్ అయిన ఆచార్య వసూళ్లు తక్కువ అనుకుంటే… హిట్‌టాక్ వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు కూడా భారీ నష్టాలు తప్పలేదు. అసలు రజనీకాంత్ సినిమాలంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. ఇప్పుడు అదే రజనీకాంత్ సినిమాలు వస్తున్నాయంటే తెలుగులో బిజినెస్ కూడా కాని పరిస్థితి.
ఇక 60 ఏళ్లు పైబడిన నాగార్జున, వెంకటేష్ సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నాగార్జునవి అన్నీ ప్లాపులే. వెంకటేష్ వయస్సుకు తగినట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేసుకుంటూ గౌరవం కాపాడుకుంటున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్య 60 ఏళ్లు దాటాక క్రేజ్ డబుల్ అవుతోంది. ఈ తరం జనరేషన్ వాళ్లకు అటు వెండితెర మీద మాత్రమే కాదు.. ఇటు బుల్లితెరపై కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు.
ఈ విషయంలో బాలయ్య తనను తాను మార్చుకున్న తీరు సూపర్ అనే చెప్పాలి. అసలు కుర్ర హీరోలతో బాలయ్య చేస్తోన్న టాక్ షోలో అడిగే ప్రశ్నలు… వారితో చేస్తోన్న కామెడీ… ఎక్కడా ఎవరిని నొప్పించకుండా టాక్ షో నడుపుతోన్న తీరు అయితే ప్రతి ఒక్కరిని.. ఇంకా చెప్పాలంటే ఇతర హీరోల అభిమానులను కూడా ఫిదా చేసి పడేస్తోంది. అన్‌స్టాపబుల్ షో దెబ్బతో బుల్లితెర లవర్స్ చాలా మంది బాలయ్య వీరాభిమానులు అయిపోతున్నారు.
అటు రాజకీయంగా ఎదిగేందుకు సినిమా వాళ్లు ముప్పుతిప్పలు పడుతుంటే బాలయ్య మాత్రం వరుసగా రెండోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచాడు. పైగా రెండోసారి జగన్ వేవ్ తట్టుకుని ముందుటి కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఎవరి నోట విన్నా జై బాలయ్యా అన్న స్లోగనే ఆటోమేటిక్‌గా వచ్చేస్తోంది. ఉదాహరణకు బాలయ్య రూలర్, సాయిధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు చాలా చోట్ల పక్క పక్కనే ఆడుతున్నాయి.
సాయితేజ్ సినిమా ఆడుతోన్న థియేటర్లలో కూడా జై బాలయ్య నినాదాలే వినిపించాయి. అఖండ తర్వాత వచ్చిన పుష్ప ఆడుతోన్న థియేటర్లలోనూ జై బాలయ్య అంటూ అరుపులు.. కేకలే.. త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2 సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలు చూస్తోన్న ప్రేక్షకులు కూడా అదే స్లోగన్‌తో కేక పెట్టించారు. అంతెందుకు రీసెంట్‌గా దర్శకుడు గీతాకృష్ణ, రైటర్ విజయేంద్రప్రసాద్ ఇద్దరూ కలిసి కాంతారా సినిమా చూస్తున్నారట. ఇంటర్వెల్‌కు ఒక్కసారిగా అందరూ జై బాలయ్యా స్లోగన్లతో థియేటర్ హోరెత్తిపోయిందట.
మరీ ముఖ్యంగా అఖండ తర్వాత బాలయ్యకు అఖండమైన ఖ్యాతి వచ్చేసింది. అఖండలో అఘోరా పాత్రలో బాలయ్య చేసిన నటన ప్రతి ఒక్కరిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి పూనకాలు తెప్పించేసింది. అందుకే ఆ స్టైల్లో ఎవరు నటించినా కూడా జై బాలయ్యా అని కేకలు పెట్టడం ఫ్యాన్స్‌కు కామన్ అయిపోయింది. అసలు ఈ స్లోగన్ పుట్టింది బాలయ్య నటించిన లారీ డ్రైవర్ తర్వాత. ఆ సినిమాలో బాలయ్య పేరుతో బాలయ్య బాలయ్య అన్న సాంగ్ రాశారు.
ఈ సాంగ్ సూపర్ హిట్. ఆ తర్వాత జై బాలయ్య నినాదం కొన్నాళ్లు బాగా పాపులర్ అయ్యింది. మళ్లీ సమరసింహారెడ్డి సినిమా టైంలో ఈ స్లోగన్‌కు ఊపు వచ్చింది. ఇక మధ్యలో కాస్త స్లో అయినా ఇప్పుడు కేవలం బాలయ్యో నందమూరి అభిమానులో మాత్రమే కాదు ప్రతి ఒక్కరు కూడా జై బాలయ్య అంటూ హోరెత్తించేస్తున్నారు.