టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే . గంగోత్రి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తున్నాడు. మరీ ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమా.. ఎలాంటి హిట్ టాక్ సంపాదించుకుందో మనకు తెలిసిందే . బన్నీ కెరియర్ లోనే హ్యూజ్ కలెక్షన్స్ సాధించిన మూవీగా పుష్ప రికార్డు నెలకొల్పింది. కాగా పుష్ప2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు .
అయితే ప్రజెంట్ ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీ త్వరలోనే ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు . ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే బన్నీ రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో జరిగిన పెళ్లిలో ఆయన భార్యతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు . ఈ క్రమంలోనే బన్నీ భార్య స్టైలిష్ డ్రెస్ వైరల్ గా మారింది . స్లీవ్ లెస్ రెడ్ టాప్ తో గ్రీన్ కలర్ లెహంగాతో బన్నీ భార్య స్పెషల్ గా నిలిచింది . అంతేకాదు స్నేహ ను ఎవరైనా చూస్తే హీరోయిన్ అనాల్సిందే. అంత అందంతో మంత్రముగ్ధులను చేసింది.
అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ ఇలాంటి డ్రెస్ వేసి హీట్ పుట్టించిన లేడీస్ చాలా తక్కువ. ఈ క్రమంలోనే బన్నీ భార్య ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి నుంచి ఫ్యాషన్ అంటే ప్యాషన్ గా ఫాలో అయ్యె స్నేహ.. పెళ్లికి ముందు కూడా చాలా యాక్టివ్ గా ఉండేదట.అయితే అంత పెద్ద ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేస్తే కచ్చితంగా ట్రోలింగ్ కి గురవుతుంది . గట్టిగా ట్రోల్ చేస్తారు. అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు పట్టించుకోదట . మెయిన్ ఆమెలో ఉన్న బిగ్ ప్లస్ పాయింట్ అదే. అంతేకాదు నా పేరు సూర్య నా ఊరు ఇండియా సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ టైంలో స్నేహ రెడ్డి నే బన్నీకి సపోర్టుగా నిలిచి ..నెగిటివ్ ని దూరం పెట్టి.. పాజిటివిటి పెంపొందించేలా చేసింది. అంతేకాదు ఇంటి బాధ్యతలను కూడా తనదైన స్టైల్ లో తీసుకొని అల్లు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తుంది . ఏది ఏమైనా సరే అటు ట్రెడిషనల్ గా ఇటు మోడ్రన్ గా బన్నీ భార్య కేక అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.