హీరోయిన్ని నమ్ముకున్న చాలా మంది నిర్మాతలు ఘోరంగా దెబ్బతిన్నారు. సినిమా అనేది వ్యాపారం. కానీ, అందరు నిర్మాతలు వ్యాపారంలా చేయడం లేదు. కొన్ని అడ్డదారుల్లో వెళ్ళి తప్పులమీద తప్పులు చేస్తూ ఉంటారు. దాంతో ఇండస్ట్రీకొచ్చింది ఒక గోల్ కోసమైతే ఇంకో లైన్లో వెళ్లి మొత్తం కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. కేవలం హీరోయిన్ మీద మోజుతో కోట్లను వెదజల్లి ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోతున్నారు.
ఆ కాలంలో ఇలా హీరోయిన్ మీద డబ్బు పెట్టి కెరీర్ నాశనం చేసుకున్నవారు లేరు. కానీ, ఆ తర్వాత జనరేషన్లో నుంచి మాత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి అవి ఆడక కోట్లను పోగొట్టుకున్నవారు కొందరైతే, సినిమా కమిటైన దగ్గర్నుంచి హీరోయిన్‌తో ఎంజాయ్ చేసి..సినిమా బడ్జెట్ కంటే ఆ బ్యూటీ మీద పెట్టిన బడ్జెట్ ఎక్కువ కావడం దానితో పాటు సినిమా ఫ్లాపవడం కోలుకోని దెబ్బ తగులుతుంది.
అంతే, మళ్ళీ సినిమా చేయడానికి ఎవరూ ఫైనాన్స్ ఇవ్వక కనుమరుగవుతున్నారు. కొందరేమో హీరోయిన్స్‌ను మేయింటైన్ చేస్తున్నాడనే నెగిటివ్ టాక్‌తో బ్యాడ్ అయిపోయి అడ్రస్ లేకుండా పోతున్నారు. సలోని హీరోయిన్గా ఒక ఊరిలో అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో తరుణ్ హీరో. చంటి అడ్డాల నిర్మాత. సినిమా భారీ డిజాస్తర్. ఆ తర్వాత అమ్మడికి అవకాశాలు రాలేదు. ఇక సలోని పని అయిపోయిందనుకున్నారు. కానీ, అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఛాన్స్ దక్కింది.
సునీల్ హీరోగా వచ్చిన ఆ సినిమా మర్యాద రామన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగమ్మాయి సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, ఈ సినిమా భారీ డిజాస్టర్. సినిమా ఫ్లాప్ కంటే కూడా హీరోయిన్ మీద నిర్మాత పర్సనల్‌గా ఖర్చు చేసింది దాదాపు 80 లక్షలట. దాంతో మళ్ళీ ఈ నిర్మాత అడ్రస్ లేడు. ఇలాంటి నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. పూరి జగన్నాథ్ నిర్మాతలను దృష్ఠిలో పెట్టుకొని ఓ మాట చెప్పారు. నిర్మాత అనే వాడు రోజూ నిద్ర మాత్రలు వేసుకుంటే గానీ పడుకోలేడు అని. అది నిజం. సేఫ్ జోన్లో సినిమాలు తీసే నిర్మాత ఇప్పుడు లేడనే చెప్పాలి.