మన సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్‌లో తన సత్తా చూపించడానికి తాపత్రయపడుతుంటాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు అంటే పక్కా కమర్షియల్ సినిమా. హీరోయిన్ అతి గ్లామర్‌గా ఉంటుంది. ఇది ఫిక్సైపోవచ్చు. అన్నీ వయసుల వారికి ఒంట్లో వేడి పుట్టాలంటే రాఘవేంద్ర రావు సినిమాలలోని సాంగ్స్ చూస్తే చాలు. అలాగే పూరి జగన్నాథ్ సినిమా అంటే మాస్ హీరోయిజంతో పాటు.. గ్లామర్ హీరోయిన్ అందాల ఆరబోత ఊహించని స్థాయిలో ఉంటుంది.
ఇక ఈవీవీ సత్యనారాయణ లాంటి కుటుంబ కథా చిత్రాల దర్శకుడంటే అన్నీ ఎమోషన్స్ ఎంతో ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సాంగ్స్‌లో రొమాన్స్ అండ్ గ్లామర్..సెంటిమెంట్ సీన్స్.. యాక్షన్ సీన్స్.. కామెడీ.. ఇలా ప్రతీదీ పుష్కలంగా దొరుకుతుంది. అయితే, కొందరు దర్శకులకి కొందరు హీరోయిన్స్‌తో మంచి కాంబినేషన్ కుదురుతుంది. వారే హీరోయిన్‌గా నటిస్తే ఆ దర్శకుడికి హిట్ ఖాయమే అని నమ్మకం అందరిలోనూ కలుగుతుంది.
అలాంటి కాంబినేషన్ ఈవీవీ సత్యనారాయణ, ఊహలది. ఊహ 1990లలో చిత్ర పరిశ్రమకి హీరోయిన్‌గా పరిచయమైంది. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఊహ ఆ తర్వాత తమిళ సినిమాలు వరుసగా చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఆ సమయంలో ఈవీవీ కన్ను ఊహ మీద పడింది. అంతే, ఆమె అనే సినిమాలో తనే ముఖ్య పాత్ర చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ భారీగా ఉన్నాయి. ఆ సీన్స్‌లో ఊహ అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.
ఆమె, అల్లుడా మజాకా, ఆయనకి ఇద్దరు, ఊహా, అమ్మలేని పుట్టిల్లు, కూతురు, ఆయనగారు..ఇలా అన్నీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలనే చేశారు. ముఖ్యంగా సినిమా మొత్తం ఏడ్చే సన్నివేశాలుంటే ఊహా అందులో అద్భుతంగా నటించి మెప్పించారు. ఓ సందర్భంలో ఈవీవీ నా సినిమాలో ఊహ ఏడిస్తే అది భారీ హిట్ అనుకోవాలి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది నిజమే, వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి ఎమోషనల్ జర్నీనే అని చెప్పాలి. ఆ తర్వాత ఊహ తన కో స్టార్ శ్రీకాంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.