టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆది పినిశెట్టి అనే పేరు కొత్త పరిచయాల అవసరం లేదు. హీరోగా తన కెరియర్ ప్రారంభించి .. ఆ తర్వాత విలన్ గా మారి ..ప్రజెంట్ చేతికి వచ్చిన సినిమాలు చేస్తూ ..హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు . రీసెంట్ గానే ప్రేమించిన హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి ..ప్రజెంట్ ఓవైపు మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే ..మరోవైపు సినిమాలు నటించడానికి ట్రై చేస్తున్నాడు.
అయితే కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ..ఆ తర్వాత అనుకోకుండా విలన్ గా నటించడం ..దీంతో హీరోగా కన్నా విలన్ గానే ఆయనను జనాలు యాక్సెప్ట్ చేయడం.. ఈ క్రమంగానే ఆయన హీరోగా కన్నా విలన్ గానే సక్సెస్ అయ్యాడు. నిజానికి ఆది పినిశెట్టి ఫిజిక్ హీరో లాంటిది ..హీరోకి ఏమాత్రం తీసిపోడు.. ఆ హైట్ ఆ వెయిట్.. ఆ కలర్ ..ఆ నటన.. స్టార్ హీరో అవ్వాల్సిన అన్ని లక్షణాలు ఆది పినిశెట్టి లో ఉన్నాయి .
కానీ స్టార్ హీరో కోసం విలన్ గా నటించడానికి ఒప్పుకొని ..హీరో నుంచి విలన్ గా మారడమే ఆయన చేసిన తప్పు అంటున్నారు సినీ విశ్లేషకులు . లేకపోతే కచ్చితంగా రామ్ చరణ్ లాగా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాజ్యమేలేసేవాడు అని ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. ఫ్రెండ్షిప్ కారణంగా హీరో కోసం విలన్ గా నటించి తన కెరీర్ ని తానే నాశనం చేసుకున్నాడు ఆది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . కాగా ఆది పినిశెట్టి తండ్రి ఎవరో కాదు ఎన్నో విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహించిన రవి రాజా పినిశెట్టి . ఆయన వారసత్వాన్ని అందుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఈ హీరో..అయితే అటు ఇటు కాకుండా మిగిలిపోయాడు.