Moviesఒడిశాలో బాల‌య్య ఆల్ టైం రికార్డు ఇదే... టాలీవుడ్‌లో చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్...

ఒడిశాలో బాల‌య్య ఆల్ టైం రికార్డు ఇదే… టాలీవుడ్‌లో చ‌రిత్ర‌లోనే ఫ‌స్ట్ టైం…!

నంద‌మూరి న‌ట‌సింహం, బాక్సాఫీస్ బొనంజా, ఓ గోల్డెన్‌స్టార్‌.. బాల‌య్య సినిమా హిట్ అయితే రికార్డులు అన్నీ మ‌టుమాయం అయిపోతాయి. బాల‌య్య‌కు స‌రైన హిట్ ప‌డితే థియేట‌ర్లు మోత మోగిపోవాల్సిందే. అస‌లు క‌రోనా టైంలో థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా ? అన్న సందేహాలు ఉన్న‌ప్పుడే బాల‌య్య డేర్‌గా అఖండ రిలీజ్ చేసేశారు. పైగా ఏపీలో టిక్కెట్ రేట్లు త‌క్కువ ఉన్నా కూడా అఖండ వీర‌బాదుడు బాదేసింది. బాల‌య్య కెరీర్‌లోనే వ‌సూళ్ల ప‌రంగా ఆల్ టైం రికార్డులు సెట్ చేసుకుంది.

ఇక గ‌తంలోనూ బాల‌య్య న‌టించిన ఎన్నో సినిమాలు ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ నేప‌థ్యంలోనే 1980ల్లో బాల‌య్య ఫుల్‌ఫామ్‌లో ఉన్న‌ప్పుడు కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ముద్దుల మావ‌య్య సినిమా చేశారు. 1989లో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య‌కు జోడీగా విజ‌య‌శాంతి న‌టించ‌గా, సీత బాల‌య్య చెల్లి పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అవ్వ‌డంతో పాటు 1989లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.

ఈ సినిమాతోనే బాల‌య్య టాప్ హీరోల లీగ్‌లోకి రావ‌డంతో పాటు.. ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాకే యువ‌ర‌త్న అన్న బిరుదు వ‌చ్చింది. ఈ సినిమా కోలీవుడ్‌లో వ‌చ్చిన ఎన్ త‌న్గ‌చి ప‌డిచావాకి రీమేక్‌గా వ‌చ్చింది. అప్ప‌టికే బాల‌య్య – కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే భార్గ‌వ్ ఆర్ట్స్ అధినేత ఎస్‌. గోపాల్‌రెడ్డి మ‌రోసారి ఈ కాంబినేష‌న్లో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు.

సినిమా తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చెల్లి సెంటిమెంట్‌కు మ‌హిళా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. థియేట‌ర్లు పోటెత్తాయి. ఆ త‌ర్వాత ఈ సినిమాను హిందీలో ఆజ్ కా అర్జున్‌గా, కన్నడంలో రవిమామ, బెంగాలీలో పబిత్రపాపీ గా రీమేక్ చేశారు. ఈ సినిమా 100 రోజుల పోస్ట‌ర్ల‌లో న‌క్ష‌త్రాల‌కే న‌క్ష‌త్రం మా నంద‌మూరి బాల‌న‌క్ష‌త్రం… అన్ని న‌క్ష‌త్రాల రికార్డుల‌ను ఊదిపారేసిన ఉత్త‌మ‌న‌క్ష‌త్రం అన్న ట్యాగ్స్ బాగా హైలెట్ అయ్యాయి.

ఇక ఆ రోజుల్లోనే 51 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న శ‌త‌దినోత్స‌వాల రికార్డుల‌ను పూర్తిగా బ్రేక్ చేసేసింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ హిస్ట‌రీలో పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ముద్దుల మావ‌య్య రికార్డుల‌కు ఎక్కింది. శ్రీకాకుళంకు బోర్డ‌ర్‌లో ఉన్న ఒడిశా టౌన్ ప‌ర్లాకిమిడీ జ‌య‌మ‌హాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.

అంత‌కు ముందు కొన్ని ద‌శాబ్దాల నుంచి తెలుగు సినిమాలు పొరుగు రాష్ట్రాలు అయిన త‌మిళ‌నాడు, క‌ర్నాక‌ట‌లో 100, 200 రోజులు ఆడిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒడిశా చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైం 100 రోజులు సినిమాగా ముద్దుల మావ‌య్య నిల‌వ‌గా.. ఆ రికార్డు ఆల్ టైం బాల‌య్య ఖాతాలో ప‌డిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news