Moviesబాల‌య్య‌పై విషం చిమ్మడ‌మే వాళ్ల ప‌నా... ఆ క్రేజ్ త‌ట్టుకోలేక‌ ఎంత...

బాల‌య్య‌పై విషం చిమ్మడ‌మే వాళ్ల ప‌నా… ఆ క్రేజ్ త‌ట్టుకోలేక‌ ఎంత దిగ‌జారిపోయారంటే…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌పై అన్‌స్టాప‌బుల్ షోకు ముందు వ‌ర‌కు జ‌నాల్లోనూ, సినీ అభిమానుల్లోనూ ఓ అపోహ ఉండేది. బాల‌య్య‌కు కోపం ఎక్కువ అని.. ఒక్కోసారి త‌న ప‌క్క‌న ఉన్న వాళ్ల మీదే చేయి చేసుకుంటార‌ని ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తూ ఉండేవి. ఇందులో కొంత నిజం ఉంది. ఎవ‌రైనా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు త‌న ఏకాగ్ర‌త‌కు భంగం క‌లిగిస్తే వాళ్ల‌పై చిర్రుబుర్రులాడ‌తారు. అది కూడా తాను పోషించే పాత్ర విష‌యంలో ఇబ్బంది క‌ల‌గూడ‌ద‌న్న‌దే బాల‌య్య ఉద్దేశం.

అకార‌ణం బాల‌య్య ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్ట‌డు. బాల‌య్య నిజంగా బాలుడే. ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్ల‌కే ఆయ‌న మ‌న‌స్త‌త్వం ఏంటో తెలుస్తుంది. బాల‌య్య ఎవ్వ‌రు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఎలా స్పందిస్తాడో ? అది ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌గా చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాల‌కే తెలుసు. ఒకానొక టైంలో న‌టి హేమ స్వ‌గ్రామానికి చెందిన వ్య‌క్తికి క్యాన్స‌ర్ వస్తే బాల‌య్య‌కు కాల్ చేసి రిపోర్టులు పెట్టింద‌ట‌. మ‌రుస‌టి రోజు బ‌స‌వ‌తార‌కం హాస్ప‌ట‌ల్ టాప్ డాక్ట‌ర్లు అంద‌రూ అక్క‌డ వాలిపోయి ఆ ఫేషెంట్‌ను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకుని ధైర్యం చెప్పార‌ని హేమ మురిసిపోయింది.

సింగ‌ర్ స్మిత‌, క‌మ‌డియ‌న్ పృథ్విరాజ్ లాంటి వాళ్లు ఫోన్ చేసి ఇబ్బందుల్లో ఉన్నామ‌ని చెపితే బాల‌య్య వెంట‌నే స్పందించార‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్‌లో చిన్న చిన్నోళ్లు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా బాల‌య్య వెంట‌నే స్పందిస్తార‌న్న పేరుంది. సీనియ‌ర్ న‌టుడు అర్జున్ సైతం రీసెంట్‌గా త‌న కుమార్తెతో ప్రారంభించిన సినిమా ముహూర్త‌పు షాట్‌కు రావాల‌ని కోరితే షూటింగ్ ఎక్క‌డ వెంట‌నే వ‌చ్చేస్తానని చెప్పార‌ట‌. అయితే ప‌ది రోజుల త‌ర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని చెపితే ఆ రోజు బాల‌య్య వీర‌సింహారెడ్డి షూటింగ్‌లో ఉండ‌డంతో కుద‌ర్లేద‌ని.. అయినా కూడా ఆ మ‌రుస‌టి రోజు బాల‌య్య ఫోన్ చేసి సారీ చెప్పార‌ని.. ఆయ‌న క‌మిట్‌మెంట్‌కు అదే నిద‌ర్శ‌నం అని అర్జున్ చెప్పారు.

అయితే సోష‌ల్ మీడియాలో ఆయ‌న క్రేజ్ చూసి త‌ట్టుకోలేక ఈర్ష్య‌తో కొంద‌రు ( ముఖ్యంగా ఓ సెక్ష‌న్ పీపుల్‌) నెగ‌టివ్ ప్ర‌చారం బాగా చేస్తున్నారు. నీచాతి రాత‌ల‌తో కుళ్లు బుద్ధి చూపించే ఓ గ్రేట్ వెబ్‌సైట్ బాల‌య్య‌ను టార్గెట్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక నెగ‌టివ్ గాసిప్ అల్లుతూనే ఉంటుంది. బ‌హుశా ఆ రాత‌లు రాసే వాళ్ల‌కు ఇలా రాయ‌క‌పోతే తిన్న‌ది అర‌గ‌దు అనుకుంటా..! రీసెంట్‌గా బాల‌య్య షూటింగ్‌లో కాస్ట్యూమ్స్ వ‌ర్క‌ర్‌పై చిందులు వేయ‌డంతో అత‌డు రెండు రోజులు షూటింగ్ సెట్‌కు రాలేద‌ని రాసుకు వ‌చ్చింది.

బాల‌య్య నిర్మాత‌పై కూడా రుస‌రుస‌లాడాడ‌ని రాసుకువ‌చ్చింది. ఈ ఒక్క‌టే కాదు… బాల‌య్య సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌వ‌ని.. వీర‌సింహారెడ్డిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ గ్రేట్ వెబ్‌సైట్ రాసుకువ‌చ్చింది. అన్‌స్టాప‌బుల్‌ను అన్ని వ‌ర్గాల వాళ్లు ఎంజాయ్ చేస్తుంటే.. ఇది ఓ పార్టీకో, వ‌ర్గానికో అంట గ‌ట్టే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది. అంతెందుకు త్రిబుల్ ఆర్ సినిమా సూప‌ర్ హిట్ అయితే ఆ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి కూడా గ్రేట్ గా నెగ‌టివ్ వార్త‌లు వేసుకుంటూ వ‌చ్చింది. మ‌రి ఈ గ్రేట్ వెబ్‌సైట్ బుద్ధి ఎప్ప‌ట‌కి మారుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news