తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు నందమూరి కుటుంబం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు పరిచయమై స్టార్ హీరోలుగా మంచి పేరు సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపును తెచ్చుకున్నారో ఆయన వారసులు కూడా అదే స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు.
నందమూరి బాలకృష్ణ వయస్సు 62 సంవత్సరాలు అయినా ఆయన అందరితో సరదాగా ఉండటానికి ఇష్టపడతారు. అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ అఖండ జ్యోతిలా వెలిగిపోతోంది. స్టార్ హీరో అయినా కాలం మారుతున్నా కొన్ని అలవాట్ల విషయంలో మాత్రం బాలయ్య మారలేదు. ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూ హోస్ట్ గా కూడా ఫ్యాన్స్ మెప్పు పొందుతున్నారు. ఫస్ట్ సీజన్ ను మించి అన్ స్టాపబుల్ సీజన్2 ను సక్సెస్ చేయాలని భావిస్తున్న బాలయ్య గెస్ట్ ల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలయ్యకు కోపం ఎక్కువని ఇండస్ట్రీలో టాక్ ఉన్నా ఆయన మంచితనం గురించి కూడా ఇండస్ట్రీలో కథలు, కథలుగా చెప్పుకుంటారు.
బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్లు మళ్లీమళ్లీ ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బాలయ్యకు పేకాట ఆడే అలవాటు ఉంది. ఈ విషయం ఆయన అభిమానులలో చాలామందికి తెలియదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ జి.నాగేశ్వర రెడ్డి బాలయ్య గురించి ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. బాలయ్య సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లతో చాలా సరదాగా ఉండేవారని జి.నాగేశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు.
టాప్ హీరో షూట్ సమయంలో బాలయ్య గారు పేకాట వచ్చా అని నన్ను అడిగారని… పేకాట ఆడగా బాలయ్య ఆట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నాడని నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత నేను వెళ్లిపోతాను సార్ అని చెప్పగా లేదు ఆడాల్సిందే అని బాలయ్య అన్నారని నాగేశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ అని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ కొడుకైనా బాలయ్యకు పేకాట అలవాటు పోలేదా ? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.