ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి కాకుండానే బిడ్డలను కంటున్న హీరో హీరోయిన్ల లిస్ట్ ఎక్కువైపోతుంది . అది ఏంటో తెలియదు కానీ పవిత్రమైన పెళ్లి అనే బంధాన్ని చులకనగా చూస్తూ పెళ్లికి ముందే మ్యాటర్ ఫినిష్ చేస్తూ ..స్టార్ హీరో హీరోయిన్లు తప్పు చేస్తూ.. ఆ తప్పును పబ్లిక్ గా ఒప్పేసుకుంటూ.. మేము ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు . అంతెందుకు మొన్నటికి మొన్న స్టార్ హీరోయిన్ అలియా భట్ పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబు పేల్చింది. ఇక తర్వాత నయనతార చేసిన తప్పు కూడా అదే.. పెళ్లైన నాలుగు నెలలకే ఏకంగా ఇద్దరు కవల పిల్లలకు తలైంది . ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్న స్టార్స్ .. రీసెంట్గా మరో బిగ్ షాక్ ఇచ్చారు.
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అర్జున్ రెడ్డి సినిమాతో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్న రాహుల్ రామకృష్ణ ..ఆ తర్వాత భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి సినిమాల్లో నటించి.. మంచి పాత్రలు పోషించి ..తనదైన స్టైల్ లో కామెడీని పండించి.. ఇండస్ట్రీలో చెరగని కమెడియన్ గా తనపై ముద్ర వేసుకున్నాడు.
అంతేకాదు రాహుల్ రామకృష్ణ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా కీలకపాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే . కాగా అప్పుడెప్పుడో మే లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ కాబోయే భార్యతో లిప్ లాక్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్..రీసెంట్ గా తన భార్య బేబీ బంప్ ఫోటోను షేర్ చేస్తూ “మీట్ అవర్ లిటిల్ ఫ్రెండ్ ” అని కామెంట్ పెట్టాడు . దీంతో జనాలు షాక్ అయిపోయారు. అసలు నీకు పెళ్లెప్పుడయింది బ్రో.. అప్పుడే అంత కడుపు ఎలా వచ్చింది ..అంటూ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇది ఫ్యాషన్ గా మారింది అంటూ కొందరు పెద్దలు మండిపడుతున్నారు . రాబోయే రోజుల్లో ఇలాంటి విచిత్రాలు ఇంకెన్ని చూడాలో అంటూ జనాలు భయపడుతున్నారు.