అలనాటి అగ్ర సినీ తారలు .. అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ఛాయాదేవి. గయ్యాళి పాత్రలు… లేడీ విలనీ పాత్రలకు ఛాయాదేవి పెట్టింది పేరు. వాస్తవానికి ఆమె హీరోయిన్‌గానే రంగ ప్రవేశం చేశారు. అయి తే.. అనూహ్యంగా ఆమెను నెగిటివ్ పాత్రలకే పరిమితం చేశారు అప్పటి దర్శకుడు నాగిరెడ్డి. మాయా బజార్ వంటి సినిమాలో అద్భుతంగా నటించిన ఛాయాదేవి.. తర్వాత కాలంలో గయ్యాళి పాత్రలకే పరిమితం అయ్యారు.
అంతేకాదు.. అత్యధిక పారితోషికం తీసుకున్న యాంటీ కారెక్టర్ నటి కూడా ఆమే కావడం గమనార్హం. అ యితే.. ఇండస్ట్రీలో ఒక టాక్ నడిచింది. అప్పటి క్యారెక్టర్ ఆర్టిస్టు, విలనీ ఆర్టిస్టు ఎస్వీఆర్‌కు.. ఛాయాదేవికి మధ్య లోతైన పరిచయం ఉండేదని టాక్. చాలా సందర్భాల్లో వీరు కలిసి నటించినప్పుడు.. ఒకే చోట ఉండేవారని.. కూడా సినీ వర్గాల్లో టాక్ నడిచింది.
ఛాయాదేవికి అప్పటికే ఆరుగురు పిల్లలు. చివరి దశలో భర్తకు దూరంగా ఒంటరిగా ఉన్నారు. దీనికి కూడా ఎస్వీఆర్‌తో పరిచయమే కారణమని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే, ఈ విషయంలో ఎన్టీఆర్ జోక్యం చేసుకోకపోయినా.. ఛాయాదేవి భర్త ఎన్టీఆర్.. సన్నిహితంగా ఉండేవారు. ఛాయాదేవి భర్త కూడా సినీ ఇండస్ట్రీతోనే పరిచయం. ఆయన కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ నేపథ్యంలో అన్నగారితో ఎక్కువ సినిమాలు చేశారు. తన కుటుంబ విషయాలను కేవలం అన్నగారితోనే పంచుకునేవారు. ఈ క్రమంలోనే ఎస్వీఆర్ విషయాన్ని ప్రస్తావించి.. తన సంసారాన్ని సరిదిద్దాలని కోరారట. కానీ, అన్నగారు మాత్రం జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. ఈ విషయం అప్పట్లో హాట్ హాట్‌గా సాగడం గమనార్హం.