వారిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు వేరు… అయినా వారిద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. అప్పటికే ఇద్దరికి పెళ్లిళ్లు అయిపోయాయి. పిల్లలు కూడా పుట్టారు. అయినా మనసులు విడదీయలేనంతగా కలిసి పోవడంతో మళ్లీ వారు పెళ్లి చేసుకున్నారు. సాక్షితో మొదలైన వీరి బంధం 1969లో అగ్నిసాక్షితో ఒక్కటైంది. అంతకు నాలుగేళ్ల ముందే కృష్ణ తన సొంత మరదలు ఇందిరాదేవిని పెళ్లాడారు.
ఇక కృష్ణ, విజయనిర్మల ప్రేమ చిత్రంగా ఉంటుంది. కృష్ణ భోజన ప్రియుడు. ఆయన షూటింగ్‌లకు వెళ్లినప్పుడు బయట భోజనం అంతగా నచ్చేది కాదు. ఎన్టీఆర్‌కు లోకల్లో షూటింగ్ ఉంటే ఆయన భార్య బసవతారకం స్వయంగా వంట చేసి పట్టుకు వెళ్లేవారు. అయితే ఇందిరాదేవి అప్పట్లో పిల్లలను చూసుకునే విషయంలో బిజీగా ఉండేవారు. కృష్ణ అవుట్‌డోర్ షూటింగ్‌లకు వెళితే భోజనానికి చాలా ఇబ్బంది పడేవారు. బయట భోజనం ఆయనకు నచ్చేదే కాదు.
ఆ టైంలో విజయనిర్మల సెట్‌కు ఇంటి భోజనం తెచ్చేదట. ఆ ఇంటి భోజనం కృష్ణకు విపరీతంగా నచ్చడంతో కృష్ణ తనకు ఇష్టమైన చికెన్, మటన్, చేపల పులుసు అడిగి మరీ ప్రత్యేకంగా విజయనిర్మలతో చేయించుకుని తినేవారట. ఇక విజయనిర్మల నూనె, వేపుళ్లు లేకుండా జాగ్రత్త పడేవారట. ఆమె ఫుడ్‌తో కృష్ణకు ఒళ్లు రాలేదు.. పొట్ట పెరగలేదు. దీంతో వారిద్దరి ఫుడ్ సాన్నిహిత్యం ప్రేమగా మారింది. వీరిద్దరు తొలిసారిగా సాక్షి సినిమాలో నటించారు. ఈ సినిమాతోనే బాపు డైరెక్టర్‌గా మారారు.
ఇక వీరిద్దరు పెళ్లి చేసుకున్నాక కూడా ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఇక విజయనిర్మలను రెండో భార్యగా స్వీకరించే విషయంలో కృష్ణ కూడా మొదటి భార్య ఇందిరను ఒప్పించారు. అయితే తనకంటే బాగా విజయనిర్మలే కృష్ణను బాగా చూసుకోవడం విజయనిర్మలకు ఎంతో నచ్చేది. ఇక విజయనిర్మల షూటింగ్‌కు వెళ్లే ముందు కూడా తన అత్త, మామలకు ఒంట చేసి మరీ వెళ్లేదట.
ఇలా వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉన్న సమయంలో ఓ స్టార్ హీరోయిన్‌తో కృష్ణ చాలా క్లోజ్‌గా ఉండడంతో వారిద్దరి సాన్నిహిత్యం ఎక్కడ పెరుగుతుందో అన్న ఆందోళన అయితే విజయనిర్మలకు ఉండేదట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. కృష్ణ – జయప్రద 45 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరు కూడా ఎంతో క్లోజ్‌గా ఉండే వాళ్లు. ఇది ప్రేమగా మారబోతోందన్న పుకార్లతో విజయనిర్మల అలెర్ట్ అయిపోయారట. ఈ కారణంతోనే విజయనిర్మల, జయప్రద మధ్య కోల్డ్‌వార్ నడిచేదన్న టాక్ ఉంది.