తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింగర్ మంగ్లీ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫోక్ సింగర్ గా పేరు సంపాదించుకున్న మంగ్లీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో క్లాస్ మాస్ బీట్స్ ని పాడుతూ కుర్రాలను ఓ ఊపు ఊపేస్తుంది . కేవలం సినిమా పాటలు మాత్రమే కాదు పలు ప్రైవేట్ ఆల్బమ్‌స్.. పొలిటికల్ పరంగా లీడర్స్ ని ప్రమోట్ చేయడానికి పాటలు పాడుతుంది. భక్తి పాటలు పాడుతూ జనాలకు మరింత దగ్గర అయింది.
మంగ్లీ ఇప్పటివరకు పాడిన పాటలన్నీ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. అంతెందుకు స్టార్ సింగర్స్ కి మించిన క్రేజీ రెమ్యూనరేషన్ ని అందుకు శ్రీముఖి ఇండస్ట్రీలో సంచల రికార్డును క్రియేట్ చేసింది . కాగా రీసెంట్గా ఏ సింగర్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకునింది సింగర్ మంగ్లీ. ఆంధ్రప్రదేశ్ లో సింగర్ మంగ్లీ కి కీలక పదవి లభించింది. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా సింగర్ మంగ్లీ నియమితులయ్యారు. నిజానికి ఈ పదవికి సంబంధించిన ప్రాసెస్ ఎప్పుడో పూర్తయింది . మార్చి నెలలోనే టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది . కాగా నాలుగు రోజుల క్రితం మంగ్లీ ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు .
ఆమె ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగునున్నారు . అంతేకాదు దీనికి గాను ఆమె నెలకు ఏకంగా లక్ష రూపాయల వేతనం తీసుకోనున్నట్లు తెలుస్తుంది . ఇది నిజంగా మంగ్లీ కి దక్కిన అరుదైన గౌరవమే . కానీ ఇలా మంగ్లీకి ఈ పదవి రావడం వల్ల ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని.. ఆమెకు ఇష్టమైన ఫోక్ పాటలను వదులుకునిందని ఓ న్యుస్ క్రేజీగా మారింది. కొందరైతే సింగర్ మంగ్లీ తన గొంతుని అమ్మేసుకునిందని ..ఇక మంగ్లీ కి ఫోక్ పాటలను పాడే ఛాన్స్ ఇవ్వరని ..పొలిటికల్ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆమెను బాగా వాడుకుంటారని జనాలు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అన్ని తెలివితేటలు ఉన్న మంగ్లీ అలా వాళ్ళ మాయలో ఎలా పడిపోయింది అంటూ జనాలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే మంగ్లీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తన కెరియర్ ఇంతటి స్థాయి కి వచ్చేలా చేసిన ఫోక్ పాటలను వదలకుండా ఆమె కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు . చూడాలి మరి మంగ్లీ ఏం చేస్తుందో..?