సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేమంటారు . దాన్ని మరోసారి ప్రూవ్ చేశారు స్టార్ కిడ్స్. ఎస్ కోలీవుడ్ స్టార్స్ గౌతమ్ కార్తీక్ ..మజిమ మోహన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాదు కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీళ్లు ఇప్పటికే ఇంట్లోని ఇరువైపు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పుచ్చుకున్నారని న్యూస్ వైరల్ గా మారింది .
కాగా వాటిని నిజం చేస్తూ తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టింది హీరోయిన్ మంజిమ మోహన్ . ఆ మేటర్ ని అఫీషియల్ చేస్తూ ఓపెన్ గానే ఐ లవ్ యు చెప్పకు వచ్చింది . ప్రియుడుతో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ..”మూడేళ్ల క్రితం వరకు నా లైఫ్ ఎలా ఉందో నాకే తెలియదు . నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు ,,ఎలా వచ్చావో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం. నా జీవితంలోకి నువ్వు వచ్చాక నా జీవితం నాకు మరింత నచ్చింది”
“నేను కోపంగా ఉన్నప్పుడు నీ ప్రేమ.. ఏడుస్తున్నప్పుడు నీ ఓదార్పు ..చాలా నచ్చాయి . దిక్కుతోచని పరిస్థితులు ఎదురైనా సరే ప్రతిసారి నువ్వు నాకు అండగా నిలిచావు. ఎలా ఉండాలో నేర్పించావు.. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు ..అందుకే నేను నీతో ప్రేమలో పడిపోయాను. నాకు తెలియకుండా నేను నా కన్నానే ఎక్కువగా ఇష్టపడుతున్నాను “అంటూ అఫీషియల్ గా ఐ లవ్ యు చెప్పింది . అంతేకాదు నా లైఫ్ లో నువ్వు ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ కోలీవుడ్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఈ జంట మాత్రం చూడటానికి భలే ముచ్చటగా ఉంది అంటున్నారు జనాలు.
View this post on Instagram