తల్లైనా కొందరు హీరోయిన్స్ ఫిజిక్ కాపాడుకోవడంలో అస్సలు కాంప్రమైజ్ కారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటి అగ్ర కథానాయికల వరకూ దాదాపుగా పెళ్ళైన వారందరూ ఎంతో జాగ్రత్తగా తమ ఫిజిక్ మీద శ్రద్ద పెడుతున్నారు. బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ తమ అందాలను అదుపు తప్పనీయడం లేదు. జీరో సైజ్ మేయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ తల్లైనా కూడా బిడ్డ పుట్టిన ఓ ఏడాదికి తిరిగి అదే ఆకృతికి వచ్చేస్తున్నారు.
బొద్దుగా ఉన్నవారు…పిల్లలు పుట్టాక ఇంకాస్త లావవుతున్నారు. దాన్ని తగ్గించుకొని పెళ్లికి ముందు ఎలా ఉంటున్నారో బిడ్డ పుట్టాక కూడా అలాగే ఉంటున్నారు. దీనికోసం క్రమం తప్పకుండా కసరత్తులు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ ఇటీవల ఓ బిడ్డకి తల్లైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాజల్‌లో ఫిజిక్ పరంగా చాలా మార్పులు వచ్చాయి.
ఈ విషయంలో నెటిజన్స్ కొన్ని కామెంట్స్ చేశారు. దానికి కాజల్ హర్ట్ అవకుండా సమాధానం ఇచ్చారు. తల్లైన తర్వాత ముఖంలో, ఎద భాగంలో అలాగే శరీరంలో కొన్ని చోట్ల అనుకోని మార్పులు వస్తాయి. దీనికి కామెంట్స్ చేయాల్సిన పనిలేదు.. అని చెప్పింది. మళ్ళీ తను వర్కౌట్స్ చేసి చాలావరకు నాజుకుగా తయారైంది. అయితే కాజల్‌ను ఇప్పుడు చూస్తే సీనియర్ హీరోల పక్కన భలే సెట్ అవుతుందన్నంత నాజూగ్గా మారిపోయింది.
శ్రియ శరణ్ కూడా తల్లైయ్యాక మునుపటి ఆకారానికి వచ్చేసింది. అసలు శ్రీయను ఇప్పుడు కూడా భర్తకు పబ్లిగ్గా ఇస్తోన్న లిప్‌లాక్‌లు చూస్తుంటే మామూలు రచ్చ కాదు. శ్రీయ నాలుగు పదుల వయస్సుకు చేరువ అవుతున్నా.. ఓ బిడ్డకు తల్లి అయినా ఆమె అందం చెక్కు చెదర్లేదు. ఇక నయనతార సరోగసి ద్వారా తల్లైన సంగతి తెలిసిందే.
దీనికి కారణం అమ్మడు ఇంకా కొన్నేళ్ళు హీరోయిన్‌గా కొనసాగాలనుకోవడమే. పిల్లలు కన్న తర్వాత శరీరంలో అన్నిచోట్లా బాగా మార్పులు వస్తాయి. కొన్ని కమర్షియల్ సినిమాలు చేయాలంటే హీరోయిన్స్‌కి గ్లామర్ ముఖ్యం. అందాల ఆరబోత తప్పనిసరి. అందుకే, తల్లైనా కూడా తమ అందాలను కాపాడుకునేందుకే ఆరాటపడుతున్నారు.