తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బడబడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ..బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . మరీ ముఖ్యంగా శ్రేయ నాగార్జున కాంబో అంటే జనాలకు పిచ్చెక్కిపోద్ది. తెరపై వీళ్లిద్దరూ కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవుతుంది.
వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా ఇండస్ట్రీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నమోదు చేసింది . కాగా రీసెంట్గా ఓ మీడియా ఇంటారాక్షన్ లో పాల్గొన్న శ్రియ ..నాగార్జున మాజీ కోడలు సమంత గురించి సంచలన కామెంట్స్ చేసింది . “నాకు సమంత ముందుగానే తెలుసని.. మంచి టాలెంట్ ఉన్న నటి అని .. మనం సినిమాలో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. ఎలాంటి ఖ్లిష్టమైన డైలాగులను అయినా.. సింగిల్ టేక్ లో చెప్పేస్తుందని.. ఇండస్ట్రీకి సమంత లాంటి హీరోయిన్ చాలా అవసరమని “చెప్పుకొచ్చింది.
అంతేకాదు “ప్రజెంట్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని ..అది ఆమెను ఏమీ చేయలేదని ..ఆమె హెల్త్ కాన్షీయస్ ఎక్కువని..వ్యాయామాలు చేస్తుందని.. ఎలాంటి పొజిషన్ అయినా ఎదుర్కొని నిలదొక్కుకునే సత్తా ఆమెలో ఉందని ..ఆ విషయం నాకు తెలుసు అని “చెప్పుకొచ్చింది. దీంతో శ్రియయ కామెంట్స్ సంచలనంగా మారాయి. నిజానికి నాగార్జునకు శ్రియకు చాలా క్లోజ్ రిలేషన్ షిప్ ఉంది. ఎంతలా అంటే ఒకానొక టైం లో అమలకు విడాకులు ఇచ్చేసి శ్రియ ని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగార్జున అని వార్తలు పుట్టించుకునేలా చేసుకున్నారు ఈ జంట . మరి అలాంటిది నాగార్జున మాజీ కోడలి పై ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి.