Moviesఆ హీరోయిన్ దెబ్బ‌తో త్రివిక్ర‌మ్‌కు వాచిపోయిందా... సెట్లోనే ర‌చ్చ చేసి ప‌డేసింద‌ట‌..!

ఆ హీరోయిన్ దెబ్బ‌తో త్రివిక్ర‌మ్‌కు వాచిపోయిందా… సెట్లోనే ర‌చ్చ చేసి ప‌డేసింద‌ట‌..!

ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలో దర్శకుడికి బాగా వాచిపోద్దా..? అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరి పాత్ర ఎంత అనే విషయంలో ముందు క్లారిటీ ఉండాల్సింది దర్శకుడికి. రచయితతో కలిసి కథ వండినప్పుడు..పాత్రలను రాసినప్పుడు బాగానే ఉంటుంది. అదే కథలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌ను నటింపచేయాలనప్పుడు మాత్రం కత్తిమీద సాము చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు పోటీ పడి ఈ పాత్ర నాకు కావాలంటే.. ఈ పాత్ర నాకు కావాలంటూ దర్శకుడి మీద పడుతుంటారు.

ఇక్కడ నిజంగా ఆ సినిమా దర్శక నిర్మాతలకి తల బొప్పి కడుతుంది. కాంప్రమైజ్ కాకపోతే మళ్ళీ సినిమాకి డేట్స్ ఇవ్వమని అడిగినప్పుడు చుక్కలు చూపిస్తారనే భయం. ఒక్కోసారి ఇద్దరు హీరోయిన్స్ పంచాయితీ హీరో గారి వద్దకీ వెళుతుంటుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొందరు హీరోలు పనిగట్టుకొని మరీ హీరోయిన్స్‌ను సిఫార్సు చేస్తుండటమే. అదనంగా ఇదో తలనొప్పి ఉంటుంది. ఇక సినిమా మొదలయ్యాక కొందరు హీరోయిన్ తన పాత్ర పరిధి పెంచమనీ మొండికేస్తుంటారు.

దీనికి ఉదాహరణ సన్నాఫ్ సత్య మూర్తి అనుకోవచ్చు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా సమంత, నిత్య మీనన్, సదా శర్మ హీరోయిన్స్‌గా నటించారు. అదా శర్మ విషయం పక్కన పెడితే సమంత, నిత్య మీనన్ విషయంలో మాత్రం గురూజీకి కాస్త ఇబ్బంది కలిగిందట. సమంత కమర్షియల్ హీరోయిన్. పెద్దగా సినిమా కమిటయ్యాక తన పాత్ర విషయంలో పేచీ పెట్టదని అంటుంటారు. కానీ, నిత్య మీనన్ మాత్రం తన పాత్ర నచ్చితేనే సినిమాకి సైన్ చేస్తుంది.

ఇక సినిమా మధ్యలో కూడా తన పాత్ర నిడివి పెంచమని డిమాండ్ చేస్తుందట. ఇది ఎంతవరకూ నిజమోగానీ త్రివిక్రమ్‌ తో చేసిన రెండు సినిమాలకి నిత్యకి – త్రివిక్రమ్‌కి తీవ్రంగా చర్చలు జరిగాయని లోలోపల మాట్లాడుకుంటున్నారు. ఒకానొక ద‌శ‌లో త‌న‌కు చెప్పిన సీన్లు ఒక‌టి.. ఇక్క‌డ తీస్తోంది మ‌రొక‌టి అని చెప్ప‌డంతో స్పాట్‌లోనే త్రివిక్ర‌మ్ అస‌హ‌నం కోల్పోయాడ‌ట‌.

అందుకే నిత్య అంటే గురూజీకి ఎక్క‌డో కాలిపోతూనే ఉంటుంద‌ని అంటూ ఉంటారు. అందుకే భీమ్లానాయ‌క్ సినిమాలో సైతం నిత్య‌పై పిక్చ‌రైజేష‌న్ చేసిన సాంగ్‌ను కూడా క‌ట్ చేయించాడ‌ని అంటూ ఉంటారు. ఇలా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు దర్శకుడి ఉండే పంచాయితీలు ఇప్పటివి కాదు. ఆ జనరేషన్ నుంచీ ఉన్నాయట. కొందరు హీరోయిన్స్ సినిమా కమిటయ్యాక కూడా తమ పాత్ర మరో హీరోయిన్ పాత్ర కంటే తక్కువగా ఉందని అలిగి సినిమా వదులుకున్నవారూ ఉన్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news