Moviesమెగా హీరోని ఫాలో అవుతున్న కృతి శెట్టి.. బెడ్ ఎక్కితే...

మెగా హీరోని ఫాలో అవుతున్న కృతి శెట్టి.. బెడ్ ఎక్కితే అది ఉండాల్సిందే..!!

ఎస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అందాల భామ కృతి శెట్టి ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . చూడడానికి చాలా హాట్ గా కనిపించే కృతి శెట్టి వయసు చాలా చిన్నది. ఇప్పటికీ అమ్మడు చదువుకుంటూనే ఉంది . ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తనకి ఇష్టమైన యాక్టింగ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది .

కేవలం ఒకే ఒక్క సినిమాతో తన తలరాతను మార్చేసుకున్న కృతిశెట్టి ప్రజెంట్ ఒక హిట్టు కోసం నానా తంటాలు పడుతుంది . అయితే ఎలాగైనా సరే కృతి శెట్టి తన తర్వాత చేసే సినిమా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే కృతికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. బయట ఎలా ఉన్నా సరే ఇంట్లో మాత్రం చాలా చిలౌట్ అవుతూ అల్లరి అల్లరిగా ఉంటుందట.

కృతి ఇప్పటికి టామ్ అండ్ జెర్రీ చూస్తుందట . అంతేకాదు కృతిశెట్టికి మరీ ముఖ్యంగా ఇడ్లీలో బూస్ట్ వేసుకొని తినడం అంటే మహా ఇష్టమట . అంతేనా కృతి శెట్టి పడుకునే ముందు కచ్చితంగా హనుమాన్ చాలీసా బుక్ ఉండాల్సిందేనట. మొదటి నుంచి కృతికి ఈ అలవాటు లేదట . ఉప్పెన సినిమా చేస్తున్న టైంలో మెగా హీరో వైష్ణవ తేజ్ ఆమెకు బాగా క్లోజ్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఆయన అలవాటు తెలుసుకున్న కృతి శెట్టి బెడ్ పక్కన మాత్రం ఎప్పుడూ హనుమాన్ చాలీసా పెట్టుకొని నిద్రపోతుందట . అంతేకాదు అలా పెట్టుకోవడం ద్వారా ఆమెకు చాలా మైండ్ రిలాక్సేషన్ ఇస్తుందట . దీంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఉప్పెన భామ కృతి శెట్టి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news