Moviesహీరోయిన్ మోజులో స్టార్ హీరో పోరంబోకు పని..మొగుడు రాసలీలను బయటపెట్టిన భార్య..!

హీరోయిన్ మోజులో స్టార్ హీరో పోరంబోకు పని..మొగుడు రాసలీలను బయటపెట్టిన భార్య..!

సెల‌బ్రిటీల జీవితాలు ఎంత గుట్టుగా సాగుతాయో… అవి బ‌య‌ట‌కు వ‌స్తే అంత ర‌చ్చ‌గా మారుతాయి. సినిమా రంగంలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్ల మ‌ధ్య లీల‌ల వ్య‌వ‌హారాలు, ఇత‌ర‌త్రా సంబంధాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవి కామ‌న్‌.. అయితే ఉన్న‌న్ని రోజులు ఈ సంబంధాలు ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఒక్క‌సారి చిన్న చిన్న విష‌యాల‌కు కూడా తేడా వ‌స్తే క‌టిఫ్ అయిపోతుంటాయి.

అయితే ఇప్పుడు బెంగాలీ హీరో ఓ హీరోయిన్ మోజులో ప‌డి అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడు. అయితే మ‌నోడి రాస‌లీల‌ల‌ను అత‌డి భార్వే స్వ‌యంగా ర‌ట్టు చేసింది. బెంగాలీలో ఇటీవ‌ల ద‌మాల్ అనే పీరియాడిక‌ల్ మూవీ ఒక‌టి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బిద్య సిన్హ సాహ మిమ్ హీరోయిన్.. కాగా హీరోగా
సియామ్ అహ్మద్ హీరోగా నటించారు. సినిమాలో హీరో, హీరోయిన్లుగా న‌టించ‌డం.. అందులో ప్రేమ‌లో ప‌డ‌డం వ‌ర‌కు ఓకే.. అయితే వీరు అంత‌కుమించి కాస్త ముందుకు వెళ్లారు.

ఎఫైర్ పెట్టుకుని.. చాటుమాటుగా రాస‌లీల‌లు కంటిన్యూ చేస్తున్నారు. ఇది హీరోగారి భార్య పొరి మెనికి అస్స‌లు న‌చ్చ‌లేదు. హీరోయిన్‌కు కౌంట‌ర్ ఇస్తూ నీ భ‌ర్త‌తో క‌లిపి పాపుల‌ర్ అయ్యేందుకు ట్రై చేయ్ అంటూ పోస్టు పెట్టింది. అయితే హీరోయిన్ కూడా హీరో భార్య‌కు రిప్లే ఇస్తూ త‌న విజ‌యాన్ని కొంద‌రు ఓర్వ‌లేక‌పోతున్నారంటూ చెప్పింది. అయితే దీనిపై హీరో భార్య పొరి మెని మ‌ళ్లీ రీ కౌంట‌ర్ ఇచ్చింది.

నీ విజ‌యాన్ని చూసి ఇక్క‌డ ఎవ్వ‌రూ కుళ్లు కోవ‌డం లేదు.. పోర‌న్ సినిమాలో నా భ‌ర్త‌, నీ జోడి బాగుంద‌ని.. మీరు ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించాల‌ని అనుకున్నాను.. అయితే మీ ఇద్ద‌రు లైన్ క్రాస్ చేస్తున్నారు.. మీ ఇద్ద‌రి వ‌ల్ల నా జీవితం నాశ‌నం కావ‌డంతో పాటు నా పిల్లాడి జీవితం కూడా దెబ్బ‌తింటోది చెప్పింది. అలాగే త‌న భ‌ర్త‌ను ఉద్దేశించి నువ్వ ద‌మాల్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంటున్నావు.. కానీ దానిని అడ్డం పెట్టుకుని నా జీవితం న‌ర‌కంగా మార్చేస్తున్నావు.. మీరిద్ద‌రు రాత్రి వేళ‌ల్లో ఫోన్ మాట్లాడుకోవ‌డంతో పాటు లైన్ క్రాస్ చేసేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ద‌య‌చేసి దీనికి ఇక్క‌డితో ఫుల్‌స్టాప్ పెట్టండని హీరో భార్య వేడుకుంటోంది. మ‌రి ఈ వివాదం ఇప్పుడు అక్క‌డ హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news