సినిమా ఇండస్ట్రీలో నిజాయితీ న్యాయం అన్నవి ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయాయి .మొత్తం కన్నీంగ్- కాంట్రవర్షియల్ -కంఫర్టబుల్ -క్యాస్టింగ్ కౌచ్ ఇలాంటి పదాలతోనే సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది అన్న సత్యం అందరికీ తెలిసిందే . కానీ ఆ సత్యాన్ని ఒప్పుకునే గట్స్ ఎవ్వరికీ లేవు . కాగా ఇండస్ట్రీలో ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ బారినపడి ఎంతోమంది స్టార్స్ బలైపోయిన సంగతి మనం వింటూనే ఉన్నాం . కాగా రీసెంట్గా అలా ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్ద ఫ్యామిలీలో మనుషులు ఎలా ఉంటారు చెప్పి షాక్ ఇచ్చింది ఫేడ్ అవుట్ హీరోయిన్.
నిజానికి అమ్మడు చేసింది తక్కువ సినిమాలే . హీరోయిన్గా హిట్ కొట్టింది చాలా తక్కువ . రెండు మూడు సినిమాలల్లో తన నటనతో జనాలను మెప్పించింది. అయితే రెండు సినిమాలు హిట్ అయినా కానీ అమ్మడుకు అవకాశాలు ఎందుకు రాలేదా అంటూ జనాలు తెగ చర్చించుకున్నారు. కాగా కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ఫెడ్ అవుట్ హీరోయిన్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఇండస్ట్రీలో మేం పెద్ద మనుషులం అంటూ చెప్పుకునే బడా హీరో ఆయన కొడుకు దుర్మార్గులని ..పగలు కొడుకు ఎంజాయ్ చేస్తే.. రాత్రి తండ్రి గోకుతాడని ..ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు అని ..అయినా కానీ ఇండస్ట్రీలో మదం ఎక్కి అల్లాడుతున్నారని.. అతనికి పేరు పలుకుబడి ఉండడంతో ఆయన ఆటలు చెల్లుతున్నాయని.. నాలాగే ఎంతోమంది అమ్మాయిలు వాళ్ళ ఖాతాలో బలైపోయారని చెప్పి షాక్ ఇచ్చింది .
అంతేకాదు ఈ విషయం వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్లకు సైతం తెలుసని కానీ ఏమి అనలేక కక్కలేక మింగలేక అన్నీ మూసుకుని ఉన్నారని సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కూడా క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారని స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి.