సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు . ఎంతోమంది హీరోలను , హీరోయిన్ కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈయన ..ప్రజెంట్ ఫేడ్ అవుట్ దర్శకుడుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . కానీ ఒక అప్పట్లో తేజ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోల సైతం ఆత్రుతగా వెయిట్ చేసేవారు. ఆయనతో ఒక్క సినిమా ఆయన నటిస్తే చాలు అంటూ కాల్ షీట్స్ ఖాళీ గా పెట్టుకొని మరీ వెయిట్ చేశారు .
అయితే పెరుగుతున్న కాంపిటీషన్ కి మారుతున్న కాలానికి తేజ డైరెక్షన్ బోర్ కొట్టేసింది. ఈ క్రమంలోని ఆయన తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో ఆయన సినిమాలు తెరకెక్కించడమే మానేశారు. అయితే తేజ డైరెక్షన్లో నటించిన ఎంతోమంది నటులు ఇప్పుడు స్టార్స్ గా ఉన్నారు. వాళ్లలో తేజాన్ని గుర్తు పెట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ ..అవకాశం ఇచ్చాడు మాలో టాలెంట్ ఉంది కాబట్టి మేము పైకి వచ్చామంటూ వీర్రవీగే వాళ్ళే ఉన్నారు. కానీ మాలో టాలెంట్ ఉన్న ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని జనాలకు పరిచయం చేసినందుకు థాంక్స్ అంటూ తేజా చెప్పుకునే వారే లేరు.
అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తేజ తన డైరెక్షన్లో నటించిన ఓ కమెడియన్ గురించి ఏకంగా ఇంట్లో ఒక రూమ్ కట్టించాడని చెప్పుకొచ్చాడు. ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ ..”నేను ఎంతోమందిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను ..కానీ నన్ను చాలా తక్కువ మందే గుర్తుపెట్టుకున్నారు . ప్రజెంట్ నా పొజిషన్ బాగోలేదు . కానీ ఏదో ఒక రోజు మళ్ళీ నేను ఫామ్ లోకి వస్తాను . నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో నన్ను గుర్తు పెట్టుకున్న వాళ్లలో మెయిన్ పర్సన్ సుమన్ శెట్టి . జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు .
నేను అంతటి మంచి అవకాశం ఇవ్వడంతో సుమన్ శెట్టి నన్ను ఎప్పుడు ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు . అంతేకాదు ఆయన ఇల్లు కట్టుకునే టైంలో నా దగ్గరకు వచ్చి నా కాళ్లకు మొక్కుబోయాడు . నేను నో చెప్పడంతో ఆయన కామ్ గా సైలెంట్ గా అయిపోయారు. అంతేకాదు మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అంటూ చెప్పుకొచ్చారు . ఈ టైంలోనే నేను నీ కొత్త ఇంట్లో నాకోసం ఒక గది కట్టు ..ఇలాంటి కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి కచ్చితంగా ఏదో ఒక రోజు నేను రోడ్డున పడతాను ..ఆ టైంలో కనీసం నాకు ఒక గది అయినా ఉండాలి కదా “అంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే సుమన్ నాకోసం తన ఇంట్లో ఒక గది పెట్టాడు ..ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ ఆ గదిని శుభ్రం చేస్తూనే ఉన్నాడట”..అంటూ చెప్పుకొచ్చారు.