శ్రీదేవి 1970వ దశకం నుంచి 1995 వరకు దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పాతతరం హీరోలు అందరితోను నటించి సూపర్ హిట్లు కొట్టింది. విచిత్రం ఏంటంటే బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలుగా నటించిన శ్రీదేవి అదే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించి మెప్పించింది.
ఆ తరం హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించి మెప్పించింది శ్రీదేవి. విచిత్రమింటంటే పాత తరం స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు జోడిగా వెండితెరపై రొమాన్స్ చేసిన శ్రీదేవి ఆ తర్వాత ఆయన తనయుడు నాగార్జునకు కూడా జోడిగా నటించి మెప్పించింది. ఇలా తండ్రీ కొడుకుల పక్కన హీరోయిన్‌గా నటించిన ఆ తరం హీరోయిన్‌గా శ్రీదేవి రికార్డుల్లోకి ఎక్కింది. రెండు తరాల హీరోలతో కూడా రొమాన్స్ చేసేంత గొప్ప అందం శ్రీదేవి సొంతం.
ఏఎన్ఆర్ తో ముందుగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవి నటించారు. ఆ తర్వాత మధుసూదన్ రావు దర్శకత్వంలో బంగారు కానుక – కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన శ్రీరంగనీతులు సినిమాలో కూడా నాగేశ్వరరావు పక్కన రొమాన్స్ చేసింది. ఆ తర్వాత వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఎస్పీ భయంకర్ సినిమాలోని ఏఎన్ఆర్ కు జోడి కట్టింది.
ఇక అఖరుపోరాటం సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవిని తీసుకోవాలని రాఘవేంద్రరావు ఫిక్స్ అయిపోయారు. శ్రీదేవి – నాగార్జున కాంబినేషన్ కొత్తగా ఉంటుందని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నాగార్జునకు జోడీగా నటించాలని అనగానే శ్రీదేవి తటపటాయించడంతో పాటు జనాలు ఏమనుకుంటారో ? అన్న సందేహం వ్యక్తం చేసిందట. నాగార్జున చూడడానికి యంగ్‌గా ఉంటాడని.. ఆయన పక్కన నటించే విషయంలో ఇబ్బంది లేకపోయినా ప్రేక్షకులు ఎలా ? రిసీవ్ చేసుకుంటారో ? అన్నదే తన డౌట్ అని చెప్పిందట.
అయితే దర్శకేంద్రడు రాఘవేంద్రరావు మాత్రం ఆ విషయం నాకు వదిలేయ్.. జనాలకు మీ జంటను ఎలా ? కనెక్ట్ చేయాలో తాను చూసుకుంటానని చెప్పి ఆమెను ఆఖరు పోరాటం సినిమాకు ఒప్పించారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ అవ్వడంతో పాటు నాగ్ – శ్రీదేవి జంటకు మంచి పేరు వచ్చింది.