Moviesమ‌ళ్లీ భారీగా పెంచేసిన శ్రీలీల‌... వామ్మో మామూలుగా కాదుగా..చుక్క‌లు క‌నిపిస్తున్న‌య్‌..!

మ‌ళ్లీ భారీగా పెంచేసిన శ్రీలీల‌… వామ్మో మామూలుగా కాదుగా..చుక్క‌లు క‌నిపిస్తున్న‌య్‌..!

ఒక‌ప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లు రెమ్యున‌రేష‌న్ పెంచాలంటే కాస్త వెన‌కా ముందు ఆలోచించేవారు. అయితే ఇప్పుడొస్తోన్న హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్ ప‌డితే చాలు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేస్తున్నారు. ఇక యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల‌కు పెళ్లిసంద‌డి అన్న ఒకే ఒక్క సినిమాతో కావాల్సినంత క్రేజ్ వ‌చ్చేసింది. ఆ సినిమాకు ముందుకు అనుకున్న టాక్ రాలేదు. అయితే క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ హిట్ అయ్యింది. అయితే ట్రేడ్ వ‌ర్గాలు సినిమాకు టాక్ బాగోలేకున్నా హిట్ అవ్వ‌డానికి ప్రేక్ష‌కులు, యువ‌త కేవ‌లం శ్రీలీల కోస‌మే ప‌దేప‌దే వ‌చ్చార‌న్న రిపోర్టులు వ‌చ్చాయి.

చాలు అంతే టాలీవుడ్ అంతా శ్రీలీల కోసం ఎగ‌బ‌డుతోంది. వెంట‌నే ర‌వితేజ ధ‌మాకా సినిమాతో పాటు ఇప్పుడు అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమాలో సైతం శ్రీలీల బాల‌య్య కూతురుగా న‌టిస్తోంది. దీంతో పాటు ప‌లువురు యంగ్ హీరోలు సైతం శ్రీలీల‌ను త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై ఒత్తిడి చేస్తున్నారు.

ఇంకేముంది ఆమె పంట పండిపోయింది. ఈ ఛాన్స్‌ను వాడుకోవాల‌ని రెమ్యున‌రేష‌న్ సినిమా సినిమాకు పెంచుకుంటూ వ‌స్తోంది. పెళ్లిసంద‌డి సినిమాకు ఆమెకు రు. 20 ల‌క్ష‌ల లోపే రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె 1.5 కోట్లు కావాల‌ని డిమాండ్ చేస్తోంద‌ట‌. అంత ఇస్తేనే సినిమాకు ఓకే చెపుతా.. లేక‌పోతే లేద‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. ఆమె డిమాండ్ల‌తో నిర్మాత‌ల‌కు కూడా చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌.
కృతి శెట్టి కూడా ఒక‌టి రెండు హిట్లు ప‌డ‌గానే రెమ్యున‌రేష‌న్ కోసం ఎడాపెడా సినిమాలు చేసుకుంటూ పోయింది.

దీంతో ఇప్పుడు ఆమెకు వ‌రుస‌గా ప్లాపులు రావ‌డంతో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు శ్రీలీల కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్టు సినిమా సినిమాకు రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోవ‌డంతో ఆమెకు దెబ్బ త‌ప్ప‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శ్రీలీల ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఖ‌చ్చితంగా రెమ్యున‌రేష‌న్ ప‌క్క‌న పెట్టి.. ముందుగా క‌థ‌ల ఎంపిక‌పై కాన్‌సంట్రేష‌న్ చేయాల‌న్న స‌ల‌హాలు వ‌స్తున్నాయి. మ‌రి ఇవి ఆమె ప‌ట్టించుకుంటుందా ? లేదా ? అన్న‌ది చూడాలి

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news