దిగ్గజ నటీమణి.. పసుపులేటి కన్నాంబ తెలుగు తెరను మూడు దశాబ్దాలకు పైగానే ఏలారు. కేవలం 23 ఏళ్ల వయసులో తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించిన ఆమె.. ఓల్డ్ హరిశ్చంద్ర సినిమాలో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్నారు. అప్పటికి ఎన్టీఆర్ కానీ, ఏన్నార్ కానీ, ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఈ సమయంలోనే ఆమె మంచి ఫామ్‌లోకి వచ్చేశారు. తర్వాత కాలంలో అటు ఎన్టీఆర్‌తోనూ, ఇటు అక్కినేనితోనూ కన్నాంబ క్యారెక్టర్ నటిగా నటించారు. తల్లిగా, అత్తగా, సోదరిగా కూడా నటించారు.
ముఖ్యంగా పౌరాణిక పాత్రలు, జానపద సినిమాల్లో కన్నాంబ – ఎన్టీఆర్‌కు మాతృమూర్తిగా నటించి మెప్పించారు. తర్వాత కాలంలో నాగభూషణం అనే దర్శకుడిని వివాహం చేసుకున్న కన్నాంబ `రాజరాజేశ్వరి` అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసి.. సినిమాలు తీశారు. సుమారు 70 పైగా సినిమాలు తీసిన ఈమె ఒక్క సినిమాలోనూ ఎన్టీఆర్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
కొన్ని సినిమాలకు నిర్మాతగా మరికొన్ని సినిమాలకు దర్శకురాలిగా కూడా కన్నాంబ పనిచేశారు. గాయకురాలిగా కూడా అప్పట్లో సూపర్ హిట్ సాధించారు. అయితే, ఆమె తీసిన అనేక సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావుకు హీరో రోల్ ఇచ్చారు. సావిత్రి, సూర్యాకాంతం వంటి అగ్ర నటీమణులను కూడా పెట్టుకున్నారు. కానీ, ఎన్టీఆర్‌ను మాత్రం ఆమె ఎప్పుడూ కీ రోల్‌కు తీసుకోలేదు. దీనిపై అప్పట్లో అనేక గుసగుసలు వినిపించేవి.
ఎన్టీఆర్.. రెమ్యునరేషన్ కోసం ఒత్తిడి చేస్తాడని, సినిమా విజయం, పరాజయంతో ఆయనకు సంబంధం ఉండదని.. అందుకే కన్నాంబ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పుకొనే వారట. అయితే, కన్నాంబ మాత్రం తాను ఏ సినిమా తీసినా.. అప్పట్లో నెల జీతాలు ఉండేవి. వాటిని మాత్రం ఠంచనుగా ఇచ్చేవారట. సినిమా జయాపజాయలతో సంబంధం లేకుండా ఆమె వ్యవహరించేవారట. ఇక కన్నాంబ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు. 1912లో జన్మించిన ఆమె చిన్న వయస్సులోనే 1964లోనే మృతిచెందారు.
కన్నాంబ ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం , తోడికోడళ్ళు, కృష్ణ కుచేల లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఆమె అలనాటి మేటినటులు ఎంజి. రామచంద్రన్, ఎస్ఎస్. రాజేంద్రన్, శివాజీ గణేశన్, నాగయ్య, పియు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు లాంటి స్టార్ హీరోలతో ఆమె నటించారు.