టాలీవుడ్‌లో వరుసగా ఐదారు సినిమాలు సూపర్ హిట్ అయిన దర్శకుల్లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరే వినిపిస్తోంది. నిన్నటి వరకు ఈ లిస్టులో కొరటాల శివ ఉండేవాడు. ఆచార్య ప్లాప్ దెబ్బతో కొరటాల అధః పాతాళానికి పడిపోయాడు. ఆచార్య కొరటాల ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసి పడేసింది. ఇక రాజమౌళిని వదిలేస్తే పెద్ద హీరోలు, సీనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి అపజయం అన్న మాట లేకుండా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి.
రీసెంట్‌గా ఎఫ్ 2కు సీక్వెల్‌గా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌తో ఎఫ్ 3 సినిమా తెరకెక్కించి తన కెరీర్‌లో వరుసగా ఆరో హిట్‌తో డబుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. పటాస్‌తో మొదలు పెడితే అనిల్‌కు వరుసగా పటాస్ – రాజా ది గ్రేట్ – సుప్రీమ్ – ఎఫ్ 2 – సరిలేరు నీకెవ్వరు – ఎఫ్ 3 సినిమాలు అన్నీ సూపర్ హిట్టే. తాజాగా బాలయ్యతో తన నెక్ట్స్ సినిమాకు అనిల్ రెడీ అయిపోతున్నాడు.
అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. అనిల్ రావిపూడి చేసిన ఏ సినిమా ప్లాప్ కాలేదు.. కానీ కొన్ని సినిమాలు కొన్నోళ్లు నష్టపోయారంటూ పుకార్లు అయితే రేగాయి. ముఖ్యంగా ఎఫ్ 3 విషయంలో ఈ ప్రచారం ఎక్కువుగా జరిగింది. దీనిపై అనిల్ కాస్త ఘాటు రిప్లేనే ఇచ్చాడు.
తన సినిమాల వల్ల ఇప్పటి వరకు ఏ బయ్యర్, నిర్మాతకు నష్టం రాలేదని, అయినా కూడా తన సినిమాలకు కలెక్షన్లు లేవని.. రావడం లేదని చెప్పండం ఇటీవల కామన్ అయిపోయిందని… వరుసగా హిట్ సినిమాలు ఇవ్వడం వల్లే తన మీద జెలసీ పెంచుకున్న వారే ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని అనిల్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటకీ అయినా తనకు నవ్వించే జానర్ అంటేనే ఇష్టమని.. అయితే బాలయ్య కోసం కాస్త డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్నట్టు చెప్పాడు.
అయితే అనిల్ తనను కావాలనే కొందరు ఇండస్ట్రీలో టార్గెట్ చేస్తున్నారని చెప్పడంతో ఆ కామెంట్లు చేసేవారు ఎవరు ? అనిల్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న కోణంలో చర్చలు స్టార్ట్ అయ్యాయి.