సిల్క్ స్మిత.. హాట్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి.. యువతకు చెమటలు పట్టించిన వ్యాంపు కారెక్టర్‌గానే అందరికీ తెలుసు. కానీ, ఎడారిలో ఒయాసిస్సులా.. ఆమె జీవితంలో నటనకు సంబంధించిన కీలక ఘట్టాలు కూడా ఉన్నాయి. ఏలూరుకు చెందిన సిల్క్ స్మిత.. అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. పేద కుటుంబంలో జన్మించి విజయలక్ష్మికి.. చిన్నవయసులోనే వివాహం కూడా చేశారు. అయితే..అనూహ్యంగా ఆమె ఇంటి నుంచి వచ్చి.. మలయాళం ఇండస్ట్రీకి పరిచయం అయింది.
తొలుతచిన్న చిన్న క్యారెక్టర్ పాత్రలు పోషించిన స్మిత.. ఈ క్రమంలోనే దర్శకుడు ఆంథోనీ ఈస్ట్‌మన్ సహకారంతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. తొలి సినిమాలో ఆమె పాత్రపేరు స్మిత. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ ఆమె నటించిన పాత్ర పేరు సిల్క్. దీంతో ఈ రెండు పేర్లుతో తర్వాత కాలంలో పాపులర్ అయిపోయింది. అయితే, అనూహ్యంగా ఆమెను వ్యాంపు క్యారెక్టర్ వైపు.. ఓ తమిళ దర్శకుడే నడిపించాడు.
సరే.. మనుషుల్లో మంచి-చెడు రెండూ ఉంటుంది కదా! మంచిని మాట్లాడుకుందాం.. స్మిత.. అనేక భాషల్లో నటించింది. వ్యాంపు పాత్రలే అయినా.. పాటల్లో నటించాలన్నా.. హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ ఇస్తేనే చేసేది. అయితే.. ఈ సొమ్మును ఆమె తన సొంతానికి పెద్దగా ఖర్చు పెట్టుకునేది కాదు.కేవలం మేకప్ కోసమే ఖర్చు చేసి.. మిగిలింది.. ఎక్కువగా తన కుటుంబానికే ఖర్చు పెట్టేది. ఎక్కువగా స్కూళ్లకు దానాలు చేసింది. అంతేకాదు.. చెన్నై, ముంబై మురికివాడల్లో పిల్లలకు చదువులు చెప్పిందంటే.. నమ్మడం కష్టమే(కానీ, ఇది నిజం).
అంతేకాదు.. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకు సాయం కూడా చేసేది. తాను ఎంత రెమ్మునరేషన్ తీసుకున్నా.. అందులో సగం.. దానం చేసేయడం.. స్మితకు నచ్చిన గొప్ప విషయం. ఆపదలో ఎవరు ఉన్నా.. వెంటనే ఆదుకునేది. పార్టీలకు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టేదట(?). మొత్తానికి అందరూ అనుకునే స్మిత హాట్ వెనుక.. చాలా కూల్ సంగతులు ఉన్నాయి. ఆమె మరీ అంత హాట్ కాదు. మానవత్వం ఉన్న కూల్ గాళ్.. ఆమె ఎంత మానవతా వాదో ఇంతకన్నా ఏం చెప్పగలం..!