Moviesషణ్ముఖ్ ఫ్రెండ్ జెస్సీ ఇంత రసికుడా..? అర్థరాత్రి ఆమె ఫోటో తో...

షణ్ముఖ్ ఫ్రెండ్ జెస్సీ ఇంత రసికుడా..? అర్థరాత్రి ఆమె ఫోటో తో అలా.. మంచి రొమాంటిక్ ఫెలో..!!

మోడల్ జెసి ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు . బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ చేసి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . ఓ వ్యాధి కారణంగా హౌస్ లో సగం నుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసి ..ఆ టైంలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . అంతేకాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి షణ్ముఖ్ జస్వంత్ -సిరి ని దూరంగా ఉండమంటూ చెప్పి ముందుగానే బయట జరిగే విషయాలను అంచనా వేసి జనాల మనసు దోచేశాడు . కాగా ఆ తర్వాత జెస్సి బయట పెద్దగా కనిపించకపోయిన.. సిరితో, షణ్ముఖతో అడపాదడపా వీడియోలో మెరుస్తూ వచ్చాడు.

కాగా రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో మెరిసాడు. బావగారు బాగున్నారా అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవారం ఓ ధీమ్ తో స్కిట్స్ చేసింది. కాగా ఈ ప్రోగ్రాంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు ఈ లవ బాయ్. అంతేకాదు జెస్సి లోని రసికుడిని బయటకు తీసుకొచ్చాడు. షో లోకి రావడం రావడమే షోలోని ఒక అమ్మాయిని పట్టుకొని ..”నేను నీకోసమే ఇక్కడికి వచ్చానని.. 2డేస్ నుంచి నువ్వే గుర్తు వస్తున్నావని.. నీతో డాన్స్ చేస్తూ చాట్ చేస్తూ కనెక్ట్ అయిపోయానని.. నీ రూపు నేను మర్చిపోలేకపోతున్నానని ..నీకు అడిక్ట్ అయిపోయానని “ఓపెన్గా అందరి ముందే చెప్పుకోచేసాడు.

దీనితో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. జెసీ ఇంత రొమాంటిక్ నా అంటూ షాక్ అయ్యారు. కాగా ఆ అమ్మాయి అయితే సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గా సూపర్ గా ఉన్నాయి . అంతేకాదు ఇది చూసిన ఎవరికైనా సరే ఒక విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ స్కిట్లో భాగంగానే జరిగింది. కానీ ఎంత స్కిట్ అయినా సరే ఇద్దరు జీవించి నటించడం గ్రేట్ . టీఆర్పిల కోసం ఆడి పాడి జనాలను అలరించారు. డాన్సులు వేస్తున్న టైం లో జెస్సి ఏకంగా అమ్మాయిని ఎత్తుకొని మరి డాన్స్ చేయడం షోకే హైలెట్గా నిలిచింది. దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా అర్థరాత్రి కూడా నువ్వు నాకు గుర్తొచ్చావు నీ ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఫోటో చూస్తూ నిద్రపోయాను అన్నాడే ..ఆ డైలాగ్ అమ్మాయిలకు ఎక్కడో టచ్ చేసింది. మరి ఇద్దరూ కలిసి ఏ రేంజ్ లో రొమాన్స్ చేశారో తెలియాలంటే ఈ ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news