Moviesకాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో వెంకటేష్‌పై.. ఆ ఒక్క విమర్శ ఎందుకు...

కాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో వెంకటేష్‌పై.. ఆ ఒక్క విమర్శ ఎందుకు వచ్చింది..!

టాలీవుడ్ లో దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. 30 సంవత్సరాల క్రితం కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెంకటేష్ హీరోగా పరిచయం అయ్యాడు. అప్పట్లో తమిళనాడు లో యంగ్ హీరోయిన్ గా ఉన్న కుష్బూ-వెంకటేష్ కు జోడిగా నటించింది. పరుచూరి బ్రదర్స్ కథ‌, సంభాషణలు అందించిన ఈ సినిమాను రామానాయుడు తన సొంత బ్యానర్ పై నిర్మించారు.

వాస్తవానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఆ సమయంలో కృష్ణ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే రామానాయుడు ఎలాగైనా ‘కలియుగ పాండవులు’ సినిమాను తెరకెక్కించాలని పట్టుదలతో ఉన్నారు. అప్పుడే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వెంకటేష్‌ను హీరోగా చేయాలని రామానాయుడు ఫిక్స్ అయిపోయారు. వెంటనే ఇండియాకు పిలిపించి ఆరు నెలలపాటు తెలుగు భాషలోనూ డ్యాన్సులోను, ఫైట్ల‌లో శిక్షణ ఇప్పించారు. అలా వెంకటేష్ అనుకోకుండా ఈ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు.

తొలి సినిమాతోనే వెంకటేష్ సూపర్ హిట్ కొట్టారు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా కొన్ని కేంద్రాల్లో వంద రోజులు కూడా ఆడింది. విజయవాడలో కలియుగ పాండవులు శత దినోత్సవం సినిరంగానికి చెందిన అతిరథ మహారధుల సమక్షంలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇక అక్కడ నుంచి వెంకటేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.. తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

వెంకటేష్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో లీనమైపోతారన్న ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే వెంకటేష్ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేవారు. సినిమా షూటింగ్‌లో కూడా తన పని చేసుకుని వెళ్లిపోయేవారు. సినిమా కథలో వేలు పెట్టడం సెట్‌లో ఇతరులతో గొడవ పడటం లాంటి విమర్శలు వెంకటేష్ పై ఎప్పుడు రాలేదు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ వెంకటేష్ పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం వెంకటేష్ విమర్శలు ఎదుర్కొన్నారు. అదే రీమేక్ హీరో.

తమిళంలో, మలయాళంలో, హిందీలో హిట్ అయిన సినిమాల్లోనే ఎక్కువగా నటించేవారని… రీమేక్ సినిమాల్లో నటించి ఎక్కువ హిట్లు కొట్టిన రీమేకుల‌ హీరోగా వెంకటేష్‌కు ముద్ర పడిపోయింది. అయితే కొందరు దీనిని తప్పుపడుతూ ఉంటారు. ఏ హీరోకు అయినా కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవడం ముఖ్యం. అని అది రీమేక్ సినిమా అయినా కూడా సినిమా హిట్ అయిందా ? నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందా లేదా అన్నదే ముఖ్యం.

చాలామంది హీరోలు రీమేక్ సినిమాల‌లో నటించి కూడా ప్లాప్‌లు ఇచ్చారని చెబుతూ ఉంటారు. అలా వెంకటేష్ కెరీర్‌లో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించి హిట్‌లు కొట్టారన్న ఒక్క అపవాదు మినహా ఆయన కెరీర్ మొత్తం మీద ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదు. ఇక ఆరు ప‌దుల‌ వయసుకు చేరువైన వెంకటేష్ తన వయసుకు తగినట్టుగా కథాబ‌లం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ వస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news