అగ్ర తార ఉదయ చంద్రిక..అంటే ఆమె ఎవరూ..అసలు ఆ పేరుతో హీరోయిన్ ఉందా..? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతాయి. అదే సీనియర్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాధ అంటే మాత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో ఆమె నటించిన సినిమాలనీ వరుసగా కళ్ళ ముందు కదలాడతాయి. మాతృ భాష మలయాళం అయిన రాధ తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోయిన్‌గా 80, 90లలో ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవికి రాధ హిట్ పేయిర్.
వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి. చిరు తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించినా రాధ ఎనర్జి అంటే తనకు ఎంతో ఇష్టం అని.. ఆమె స్పీడ్‌కు ఒక్కోసారి తాను సైతం స్టన్ అయిన రోజులు ఉన్నాయని చెప్పారు. అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన రాధ ఆ సమయంలో ఏ ప్రాజెక్ట్ మొదలవుతున్నా ఫస్ట్ ఛాయిస్ రాధ అనేట్టుగా ఉండేది.
ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలలో కూడా రాధ తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో టాప్ అనిపించుకున్నారు. సౌత్ భాషలన్నీ కలిపి దాదాపు 250 సినిమాలలో హీరోయిన్‌గా నటించారు. అయితే, ఆ తరం కథానాయికల్లో సుహాసిని, విజయశాంతి, రాధిక లాంటి వారు ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తున్నారు. అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ సత్తా చాటుతున్నారు. అయితే, అందాల తారగా పేరు తెచ్చుకున్న రాధ మాత్రం మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వలేకపోయారు.
ఆమె నటిస్తే చూడాలనుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. కానీ, రాధ తన ఫిజిక్ కారణంగా నటించడానికి ఆసక్తి చూపించడం లేదా.. లేక అవకాశాలు రావడం లేదా తెలియదు గానీ రీ ఎంట్రీ మాత్రం ఇవ్వలేకపోయారు. తన కూతురు కార్తీకని హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా పరిచయమైన జోష్ సినిమాతో కార్తీక కూడా హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే, కార్తీక స్టార్ హీరోయిన్ కాకుండానే సర్దేసుకుంది.
రంగం లాంటి హిట్ సినిమా పడినా ఆమె తల్లి నటనలో పదో వంతు కూడా టాలెంట్ లేకపోవడంతో ఫేడవుట్ అయిపోయింది. ఆ తర్వాత రాధ రెండో కూతురు తులసి హీరోయిన్ అయినా జనాలు పట్టించుకోలేదు. ఇక రాధ కనీసం సీరియల్స్‌లో అయినా కనిపిస్తే బావుంటుందని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సీనియర్ నటీమణి అభిమానుల కోసం మళ్ళీ మొహానికి రంగేసుకుంటారా లేదా…!