టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అరుదైన వ్యాధిగా గుర్తించబడిన ఈ వ్యాధి సమంతకి సోకడం చాలా బాధాకరం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ వ్యాధి ముఖ్యంగా ఎక్కువ వ్యాయామాలు చేయడం ద్వారా సోకుతుందని ఇప్పటికే రష్యన్ డాక్టర్లు తెలిపారు . కాగా రీసెంట్గా సమంత కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ ఫొటోస్ షేర్ చేసింది ఎవరో కాదు.. సమంతనే.
తాజా గా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి అద్దిరిపోయే కొటేషన్ ఇచ్చింది సమంత. ” నా ఫ్రెండ్ ఒకరు ఒక మాట చెప్పారు ..అనుకున్న పని చేసి చూపించాలి.. వీలైనంత విధంగా ట్రై చేయాలి.. అతడి నుంచి ఆమోటివ్ ని నేను రుణంగా తీసుకున్న. అందుకే యశోద ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగా” అని పోస్ట్ పెట్టుకువచ్చింది. అంతేకాదు ఈ ఫొటోస్ లో సమంత చూడడానికి చాలా డల్ గా ..నిరసించిపోయి.. బక్క చిక్కిపోయి ఫేస్ మొత్తం మారిపోయి ..పూర్తిగా అనారోగ్యానికి గురైన అమ్మాయిగా తెలుస్తుంది.
ఈ ఫొటోస్ చూసిన సమంత ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . మరి కొంతమంది స్టే స్ట్రాంగ్ సమంత ..గెట్ వెల్ సూన్ అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు యశోద సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నువ్వు ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఫుల్ హ్యాపీగా పాల్గొంటామని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకప్పటి సమంతని చూసిన జనాలు ఈ ఫోటోలను సమంతను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.. చాలా మారిపోయింది సమంత అంటూ ఫీల్ అవుతున్నారు. ఈ ఫోటోలో సమంత చాలా డల్ గా నీరసంగా కనిపిస్తుంది.