Moviesనా పని అయిపోయింది..నా వల్ల కాదు.. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న...

నా పని అయిపోయింది..నా వల్ల కాదు.. లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న సమంత(వీడియో) ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసింది అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. కొన్ని అనివార్య కారణాల కారణంగా విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటుంది . అయితే వీళ్లి విడాకులు తీసుకొని ఏడాది కావస్తున్న వీళ్ళ పై సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది .

కాగా కొన్నాళ్ల కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాకు దూరమైన సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా రీసెంట్ గానే సమంత స్పందిస్తూ..” నేను మయోసైటీస్ జబ్బు కారణంగా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా సమంత పై ఉన్న నెగెటివిటీ మొత్తం పాజిటివ్ కామెంట్స్ గా మారిపోయాయి.

కాగా ఆమె ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో నటిస్తున్న యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మయోసైటిస్ జబ్బు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. అంతేకాదు సమంత ఆ ఇంటర్వ్యూల కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సమంత మాట్లాడుతూ..” ఏం జరుగుతుందో చెప్పలేను ..నేను దీనిపై పోరాటం చేయాలి. ఒక్కోసారి ఒక అడుగు కూడా ముందుకు వేయలేను ఏమో అనిపిస్తుంది …ఒక్కోసారి ఇంత దూరం వచ్చానా నేను అని అనిపిస్తుంది ..కొన్ని మంచి రోజులే ఉంటాయి కొన్ని చెడ్డ రోజుల్లో ఉంటాయి . దేనికైనా సరే తెగించి ఉండాలి . ఇలా పోరాటం చేస్తున్నది నేను ఒక్కదాన్నే కాదు ..నాలా చాలామంది పోరాటం చేస్తున్నారు . ఈ వ్యాధిపై నేను పోరాటం చేస్తా .చివరకు గెలుస్తారని నమ్మకం ఉంది . భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు కూడా తెలియదు “అంటూ సమంత ఎమోషనల్ గా స్పందించింది . సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news