నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టైం బాగోలేదా అంటే అవుననే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ కన్నడలో కన్నా తెలుగులోనే ఫేమస్ అయ్యింది . కన్నడలో సినిమాలు చేసిన సరే అక్కడ రాని గుర్తింపు తెలుగులో దక్కించుకొని ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది . గత ఏడాది డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో మెరిసిన రష్మిక ఎలాంటి హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రష్మిక సినీ కెరియర్ గురించి చెప్పాలంటే పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అన్న రేంజ్ లో చెప్పుకునే స్థాయికి ఆమె ఎదిగిపోయింది. అంతేకాదు పుష్ప సినిమా వరకు రెండు మూడు సినిమాల ఖాతాలో ఉన్నాయి. అయితే పుష్ప సినిమా తర్వాత ఏకంగా 10-12 సినిమాలు ఆమె ఖాతాలో వచ్చి పడ్డాయి . మరీ ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు శ్రీవల్లి అందాలు తెగ నచ్చేసాయి . అందుకే ఆమె ఖాతాలో ఇప్పుడు బాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి .
కాగా ఈ మధ్యకాలంలో రష్మిక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చేసుకుంది . కన్నడ డైరెక్టర్ రిషిబ్ శెట్టితో రష్మిక మందన వివాదం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతుందో తెలిసిందే. ఈ క్రమంలోనే కాంతారా సినిమా నేను చూడలేదు అంటూ ఓపెన్ గా చెప్పిన రష్మిక ను ..కన్నడ ప్రజలు మరింత ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె హెడ్ వెయిట్ కు కన్నడ ఇండస్ట్రీ నుంచి నిషేధం విధించాలని చర్చిస్తున్నారట .
ఈ క్రమంలోనే రష్మిక పేరు సోషల్ మీడియాలో డిజాస్టర్ గా మారింది . ఆమెపై ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి . గతంలో రష్మిక చేసిన పాడు పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి . ఈ క్రమంలోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ రష్మిక మందనను పుష్ప సినిమా నుండి తీసేయాలని డిసైడ్ అయ్యారట . ఈ క్రమంలోనే ఆమెతో రాసుకున్న అగ్రిమెంట్ సైతం క్యాన్సిల్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అసలే పుష్ప2 సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఇలాంటి టైంలో రష్మిక లాంటి హీరోయిన్ ని పెట్టుకుంటే సినిమాకి కచ్చితంగా నెగటివ్ పాయింట్స్ ఎక్కువగా వినిపిస్తాయి. అంతేకాదు పుష్ప 2 కి రష్మిక మందన తన రేంజ్ కు మించి డబల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది . ఈ క్రమంలోనే సుకుమార్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేశాడని సినివర్గాల నుంచి సమాచారం అందుతుంది .రష్మిక నోటి దుడుకు రిజల్డ్ ప్రజెంట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.