Moviesఆఖరికి అవి కొనుకోవడానికి డబ్బులు లేవు..ఇండస్ట్రీలోకి రాక ముందు ఇన్ని బాధలు...

ఆఖరికి అవి కొనుకోవడానికి డబ్బులు లేవు..ఇండస్ట్రీలోకి రాక ముందు ఇన్ని బాధలు పడ్డిందా..రష్మిక కటిక పేదరికం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!!

వాట్ ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఒక బొమ్మ కొనుక్కోవడానికి ఆలోచించిందా..? ఏంటి.. సిల్లీగా ఉందా అని అనుకుంటున్నారా అవునండి నిజమే. ఈ విషయాన్ని స్వయానా రష్మిక మందననే చెప్పుకొచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్,కోలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తన సినిమాలోకి రాకముందు కటిక పేదరికం అనుభవించాలని చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”తాను సినిమాల్లోకి రాకముందు ఎలాంటి పేదరికం అనుభవించాను చెప్పుకొచ్చింది”.

ఈ క్రమంలో రష్మిక మందన మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక మందన మాట్లాడుతూ..” సినిమాలోకి వచ్చాక నేను డబ్బులు బాగా సంపాదించుకున్నాను. ఏది కావాలన్నా కొనుక్కునే స్థాయిలో ఉన్నాను .కానీ నేను డబ్బును ఎప్పుడు దుబారా చేయను .ఎందుకంటే నేను గతంలో పడిన పేదరికపు బాధలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి.. ఏదైనా కొనుక్కునే స్తోమత ఉంది. కానీ నా చిన్నతనంలో మా పొజిషన్ అలా లేదు . ఇంటి అద్దె కట్టడానికి కూడా చాలా కష్టపడేవారు మా నాన్నగారు”.

“ఈ క్రమంలోని ఎక్కడ తక్కువగా రెంట్ ఉన్న ఇల్లు దొరికితే అక్కడికి మారే వాళ్ళు. రెండు నెలకు ఓ ఇళ్లు మారాం. చాలా ఇబ్బందులు పడ్డాం. అంతేకాదు అంత ఇబ్బందుల్లో నేను అడిగిన బొమ్మను కొనివ్వడానికి మా ఇంట్లో వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ నేనే వాళ్ళని అడిగేదానిని కాదు. నాకు తెలుసు ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవు . అందుకే నేను బొమ్మను కొని ఇవ్వమని మెండి చేసేదాన్ని కాదు . అందుకే కష్టపడి పైకి వచ్చి ఇలాంటి పొజిషన్లో ఉన్నాను. ఇప్పటికి నేను డబ్బులు వృధా చేయను ..దాచిపెట్టి ఇన్వెస్ట్ చేస్తాను “అంటూ చెప్పుకోచ్చింది. ఈ క్రమంలో రష్మిక మందన సినిమాలోకి రాకముందు ఇన్ని బాధలు పడిందా..? అంటూ జనాలు బాధపడుతున్నారు. కాగా ఒకప్పుడు బొమ్మ కొనుక్కునే స్తోమత లేని రష్మిక మందన ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకి నాలుగైదు కోట్లు తీసుకుంటుంది. త్వరలోనే పుష్ప2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతుంది రష్మిక మందన.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news