Moviesఆ కర్మ నాకు పట్టలేదు సార్..రష్మిక మందన్నా డేరింగ్ కామెంట్స్..!!

ఆ కర్మ నాకు పట్టలేదు సార్..రష్మిక మందన్నా డేరింగ్ కామెంట్స్..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలో అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది . కాగా రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన.. బాలీవుడ్ లో ఏకంగా ఏడు సినిమాలకు సైన్ చేసింది .

తమిళంలో రెండు సినిమాలు.. తెలుగులో రెండు సినిమాలకు.. కమిట్ అయ్యి ఫుల్ బిజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది . కాగా రీసెంట్గా రష్మిక మందన్నా కు ఓ స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది. మాటల మాత్రికుడు శ్రీనివాసరావు డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి హీరోయిన్గా పూజ హెగ్డే ఎప్పుడో సెలెక్ట్ అయింది. కాగా రెండో హీరోయిన్ కోసం చాలా మంది ముద్దుగుమ్మలను ట్రై చేసి లాస్ట్ కి రష్మిక మందనకు ఆఫర్ ఇచ్చారట.

అయితే రష్మిక మందన్నా ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్గా మారింది. అంతేకాదు సెకండ్ హీరోయిన్గా చేసే కర్మ నాకు పట్టలేదు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిందట. దీంతో రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు రష్మిక మందన్నాకు ఎంత ధైర్యం ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లాంటి డైరెక్టర్ తో అలా మాట్లాడుతుంది అంటూ జనాలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో రష్మిక హెడ్ వెయిట్ కొంచెం పెరిగింది అంటున్నారు జనాలు ..బాలీవుడ్ పై కాన్సెప్ట్రేషన్ చేస్తూ లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ను దూరం పెడుతుంది అంటూ చెప్పకువస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news