Moviesనాకు మూడ్ వస్తే.. మొదట చేసే పని అదే..రష్మిక కామెంట్స్ వైరల్..!?

నాకు మూడ్ వస్తే.. మొదట చేసే పని అదే..రష్మిక కామెంట్స్ వైరల్..!?

పుష్ప సినిమాతో తన క్రేజ్ ని, రేంజ్ ని, రెమ్యూనరేషన్ ని భారీ స్థాయిలో పెంచేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మరీ ముఖ్యంగా రష్మిక మందన మాల్ దీవ్స్ కి వెళ్లి వచ్చినప్పటి నుంచి చేస్తున్న హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండిగా మారుతూనే.. ఆమెను ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మికను ఎక్కువగా ట్రోల్ చేస్తున్న జనాల కు నేషనల్ క్రష్ ఘాటుగా కౌంటర్ వేసింది .

సోషల్ మీడియా వేదికగా ..”నేనంటే మీకు ఎందుకంత పగ ..?నాపై ఎందుకంత నెగెటివిటీ ..? నేనేం చేశాను..? తప్పు చేస్తే తిట్టండి ..అంతేకానీ ఉన్నవి లేనివి కల్పించి నా పై ఇలా న్యూస్ లు క్రియేట్ చేసి నన్ను బాధ పెట్టకండి ..నేను అసలు ఇలాంటి విషయాలు పై రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నాను. అయినా నా మనసు అంగీకరించట్లేదు ..నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను పట్టుకుని నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు” అంటూ ఫైర్ అయ్యింది.

కాగా రీసెంట్ గా అభిమానులకు మరో సజెషన్ ఇచ్చింది. ” బాధగా ఉన్నా.. కోపంగా ఉన్నా.. హ్యాపీగా ఉన్నా.. సాడ్ గా ఉన్నా.. టెన్షన్ లో ఉన్న ,కూల్ గా ఉన్న ..ప్రపంచం ఏమైపోతున్న సరే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి . వ్యాయామం చేయండి . మీ మనసు ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది . నేనైతే అలా చేస్తాను. నా మూడ్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ నేను చేసే పని వ్యాయామం . అంతే ..నిద్ర లేచిన మొదలు నా దృష్టి మొత్తం వ్యాయామం పైనే ఉంటుంది . ఒకవేళ ఎవరైనా వర్కౌట్ చేయకపోతే ట్రై చేయండి “అంటూ ఇన్స్టా స్టోరీలో రష్మిక రాసుకొచ్చింది. దీంతో ఈమె పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news