ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..ఎలాంటి హాట్ ఫోటో షూట్ చేస్తుందో మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత రష్మిక మందన్నా తన రేంజ్ , క్రేజ్, రెమ్యూనరేషన్ మూడు పెరిగిపోయాయి. పుష్ప తర్వాత వచ్చిన “ఆడవారు మీకు జోహార్లు”.. సినిమా డిజాస్టర్ గా మారింది. అయినా సరే పుష్ప ఇచ్చిన సక్సెస్ తో రష్మిక దూసుకుపోతుంది . ఇప్పుడు అమ్మడి చేతిలో టాలీవుడ్ లో రెండు ..కోలీవుడ్లో రెండు.. బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్టులో భాగమైంది రష్మిక .
ఈ క్రమంలోనే రష్మిక ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేస్తూనే కొన్ని కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ మధ్యనే సోషల్ మీడియాలో తనని ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని.. ఆ విషయం తనని బాధిస్తుందని ట్రోలర్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ చేసిన రష్మిక..రీసెంట్గా హీరోయిన్ తమన్నా పై చీప్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి .మనకు తెలిసిందే తమన్నా ఇండస్ట్రీలో ఎలాంటి మంచి పేరు సంపాదించుకుందో .
ఇప్పుడు అంటే అమ్మడు హవా తగ్గింది కానీ , కెరియర్ మొదట్లో ఓ ఊపు ఊపేసింది. వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన తమ్మన్నా.. ప్రజెంట్ అవకాశాలు లేక ఐటెం సాంగ్స్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రష్మిక తమన్నా పై పరోక్ష కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది . “కెరీర్ బాగున్నప్పుడు అలా ఐటెం సాంగ్ లో ఎలా నటిస్తారు తర్వాత అవకాశాలు ఎలా దక్కుతాయని అనుకుంటారు..? కెరియర్ లో మనం వేసే ప్రతి స్టెప్ ఆచితూచి వేయాలి.. అప్పుడే మన కెరియర్ టాప్ పొజిషన్ లో ఉంటుంది.. అవకాశాలు లేవు కదా అని ..డబ్బుల కోసం ఎలాంటి రోల్స్ కైనా ఓకే చేయడం ఇండస్ట్రీలో హీరోయిన్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే రష్మిక మాట్లాడిన మాటలు తమన్నాను ఉద్దేశించి అంటూ జనాలు రష్మికను ట్రోల్ చేస్తున్నారు.