బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ అవదామని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో మెప్పిస్తూ బుల్లితెరపై కూడా ఆ హవా కొనసాగిస్తుంది . ప్రజెంట్ బుల్లితెరపై వన్ ఆఫ్ ద స్టార్ యాంకర్ గా రాజ్యమేలుతున్న రష్మీ.. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా హోస్టుగా వ్యవహరిస్తుంది. తనదైన స్టైల్ లో వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తుంది.
కాగా రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రక్ష్మీ మాట్లాడుతూ ..సంచలన విషయాలను బయటపెట్టింది . ఈ క్రమంలోనె ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ష్మీ మాట్లాడుతూ..” నేను నా జీవితంలో ఒక వ్యక్తికి సారీ చెప్పాలనుకుంటున్నాను ,.ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు బాగా తెలుసు ..ఆ వ్యక్తి టాలెంట్ స్టేజిపై చూపించాడని.. ఆ సమయంలోనే ఆ వ్యక్తిని నేను ఎక్కువగా పట్టించుకోలేదని” చెప్పుకొచ్చింది . అంతేకాదు “నా ఈ ప్రయాణంలో అతను ఎంతో హెల్ప్ చేశాడని ..కానీ మొదట నేను ఆయనను పట్టించుకోలేకపోయానని ..అతని స్కిట్లు బాగా నచ్చడంతో దగ్గరయ్యానని.. ఆ కారణం వల్ల నేను మనస్పూర్తిగా ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నానని “చెప్పుకొచ్చింది.
అంతేకాదు “ఒకవేళ ఆ వ్యక్తి మాటలు నేను ఆరోజు పట్టించుకోకుండా ఉంటే.. ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉండే దాన్ని కాదేమో అంటూ చెప్పుకోరావడం సంచలనంగా మారింది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో కాదు ఆర్టిస్ట్ బాబు అని ఫైనల్ గా ఆ పేరును బయటపెట్టేసింది . అప్పట్లో ఆయన వేసిన వేషాల వల్ల ఆర్టిస్ట్ బాబు రైటర్ బాబుగా తయారయ్యాడని.. మేము సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ రేంజ్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది . అవకాశాలు ఇవ్వకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ బెదిరించాడట. దీనివల్ల ఆయన ని రైటర్ బాబుగా మార్చామని రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. కేవలం నేనే కాదు మీరు ఆయనకు సారీ చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది. రష్మీ ఈ మాటలు సరదాగా అన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ లో ట్రెండ్ అవుతున్నాయి.