Moviesఅనుష్క తో ప్రభాస్ పెళ్ళి ప్రపోజల్ నిజమే..కానీ ఆ ఒక్క విషయం...

అనుష్క తో ప్రభాస్ పెళ్ళి ప్రపోజల్ నిజమే..కానీ ఆ ఒక్క విషయం లోనే డార్లింగ్ వెనకడుగు..!!

సోషల్ మీడియాలో ఎవరు గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే..అది కచ్చితంగా అందులో ఒకటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి మేటర్ . వీళ్ళ పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది . అంతేకాదు వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలని కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు . కానీ ఈ జంట అభిమానుల కోరిక తీర్చట్లేదు. కాగా సినీతెరపై ఈ జంట కలిసిన నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది .

అంతే కాదు తెర పై వీళ్ల కెమిస్ట్రీకి ఫిదా అయీంది సినీ లోకం. అందుకే మీరు పెళ్లి చేసుకోండి అంటూ ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . అయితే మా మధ్య ప్రేమ లేదని కేవలం ఫ్రెండ్షిప్ అంటూ ఈ జంట చెప్పుకొస్తున్నారు . కాగా ఇన్సైడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ – అనుష్క పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే కాని ..ప్రభాస్ అందుకో నో చెప్పాడట . దానికి మెయిన్ కారణం ప్రభాస్.. అనుష్క లో ఉన్న నెగటివ్ పాయింట్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

కృష్ణంరాజు బ్రతికున్న టైం లోని ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు జరిగాయని ..అదే టైం లో అనుష్కతో పెళ్లి మ్యాటర్ కూడా వచ్చిందని.. ప్రభాస్ – అనుష్కతో పెళ్లి నాకేం ప్రాబ్లం లేదు కానీ అంటూ ఒక కండిషన్ పెట్టారట. అన్ని బాగున్న అనుష్కకు కొంచెం ఈగో ఎక్కువ . మొండి తనం. నేను చెప్పిందే కరెక్ట్ తనదే పై చేయి అనే స్వభావం ..ఇంచు మించు ప్రభాస్ ది అలాగే ఉండే మైండ్ సెట్.. నేను చెప్పింది కరెక్ట్..అదే చేయాలి అని.

అయితే ఇద్దరు ఒకే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే ఆ రిలేషన్షిప్ త్వరగా తెగిపోతుందని.. ఈ కారణంగానే పెళ్లి అని బంధంలో మేము అడుగుపట్టలేకపోతున్నామని ప్రభాస్ చెప్పుకొచ్చారట . పాయింట్ వాలీడ్ కావడంతో కృష్ణంరాజు సైతం ఏం చెప్పలేక సైలెంట్ అయిపోయారట . ఆ ఒక్క విషయం తప్పిస్తే అనుష్క ని పెళ్లి చేసుకోవడానికి ప్రభాస్ కి ఏం ప్రాబ్లం లేదు. ప్రభాస్ పై కూడా అనుష్క అలాగే చెప్తుంది . ప్రభాస్ అంటే ఇష్టమే కానీ ప్రభాస్ కోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోలేను ..నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చేసిందట . ఈ విషయం కారణంగానే వీళ్ళ పెళ్ళి వాయిదా పడుతూ వస్తుంది అని ..ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గిన ఇప్పటికే పెళ్లయిపోయిండేదని తెలుస్తుంది . మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి గుడ్ న్యూస్ చెప్తుందో ఈఅ జంట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news