Moviesఆదిపురుష్ తేడా కొట్టేసిందా... ప్ర‌భాస్‌కే న‌మ్మ‌కాల్లేక ఏం చేస్తున్నాడంటే..!

ఆదిపురుష్ తేడా కొట్టేసిందా… ప్ర‌భాస్‌కే న‌మ్మ‌కాల్లేక ఏం చేస్తున్నాడంటే..!

యంగ్‌రెబ‌ల్ స్ట‌ర్ ప్ర‌భాస్‌కు బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత హిట్ లేదు. సాహో అంచ‌నాలు అందుకోలేదు. రాధేశ్యామ్ డిజాస్ట‌ర్‌. బాహుబ‌లి సినిమాతో వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తున్నాడే త‌ప్పా స‌రైన క‌థా బ‌లంతో పాటు ఇండియ‌న్ సినిమా అభిమానుల‌ను అల‌రించి త‌న మార్కెట్ స్టాండ‌ప్ చేసుకునే సినిమాలు అయితే చేయ‌ట్లేదు.

ఇక రాధేశ్యామ్ రిజ‌ల్ట్ ప్ర‌భాస్‌ను మ‌రీ డిజ‌ప్పాయింట్ చేసింది. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రాజెక్ట్ కే – స్పిరిట్ – స‌లార్ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. ముందుగా రిలీజ్‌కు లైన్లో ఉన్న ఆదిపురుష్‌ను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

అయితే ఆదిపురుష్ ఇప్పుడు సంక్రాంతికి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. సంక్రాంతికి బాల‌య్య‌, చిరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఆదిపురుష్‌ను స‌మ్మ‌ర్‌కు అనుకున్నారు. ఇప్పుడు చూస్తే స‌మ్మ‌ర్‌కు కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వ‌డం సందేహ‌మే అంటున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్ వీడియోలు చూస్తే అస‌లు ప్ర‌భాస్ అభిమానుల‌కే ఈ సినిమాపై న‌మ్మ‌కం పోయింది. అందుకే ఈ సినిమాకు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జ‌ర‌గ‌డం లేదు.

స‌లార్‌, ప్రాజెక్ట్ కేపై ఉన్న బ‌జ్ ఆదిపురుష్‌పై అస్స‌లు లేదు. పైగా గ్రాఫిక్స్ అస్స‌లు బాగోలేద‌ని.. హైదరాబాద్ అమీర్‌పేట‌లో యానిమేష‌న్ స్టైల్లో ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ సినిమాను ఇప్పుడు పూర్తిగా మార్చ‌క‌పోతే ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ ప‌డ‌డంతో పాటు మ‌నోడి ఇమేజ్ కూడా పూర్తిగా పోతుంద‌న్న టాక్ వ‌చ్చేసింది. ఆదిపురుష్ కూడా ప్లాప్ అయితే ప్ర‌భాస్ మార్కెట్ పూర్తిగా ప‌డిపోతుంది.

అందుకే ఇప్పుడు ఆదిపురుష్‌కు చాలా వ‌ర‌కు రీ షూట్లు చేస్తున్నార‌ట‌. ఇంకా చెప్పాలంటే ఆదిపురుష్‌ను ప‌క్క‌న పెట్టేసి స‌లార్‌ను ముందు రిలీజ్ చేయాల‌ని కూడా ప్ర‌భాస్ అనుకుంటున్నాడ‌ట‌. అంటే ప్ర‌భాస్‌కే ఈ సినిమాపై న‌మ్మ‌కం లేద‌ని కూడా టాక్ వస్తోంది. మ‌రి ఆదిపురుష్ ఎప్పుడు వ‌స్తుందో ? ఏంటో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news